ఔనే నేరుచుకొంటి వప్పుడే నీవు
(॥పల్లవి॥)
ఔనే నేరుచుకొంటి వప్పుడే నీవు
మౌనాన నాతనితోడ మందెమేళమా
(॥ఔనే॥)
మంకుతోడి వొట్లు మాయదారితట్లు
యింకా విభునితోడ నేమిటికే
జంకించేవు బొమ్మలను జరసేవు కన్నులను
బింకమున నిందువంకఁ బెద్దరికమా
(॥ఔనే॥)
నయగారి మొక్కలు నాఁటకపునొక్కులు
ప్రియునితో నిప్పు డిట్టె పెంచనేఁటికే
దయఁజూడు మిప్పుడే తప్పులెంచకితని
రయమున నింతలోనే రాజసములా
(॥ఔనే॥)
చేవదేరే సిగ్గులు చిరునవ్వుముక్కులు
శ్రీ వేంకటేశ్వరు మీఁదఁ జిమ్మేవేమే
యీ వల నితఁడే కూడె యియ్యకోలుగా నిన్ను
భావించ నీకిది నేఁడు బలుపంతమా
(||pallavi||)
aune nerusugŏṁṭi vappuḍe nīvu
maunāna nādanidoḍa maṁdĕmeḽamā
(||aune||)
maṁkudoḍi vŏṭlu māyadāridaṭlu
yiṁkā vibhunidoḍa nemiḍige
jaṁkiṁchevu bŏmmalanu jarasevu kannulanu
biṁkamuna niṁduvaṁkam̐ bĕddarigamā
(||aune||)
nayagāri mŏkkalu nām̐ṭagabunŏkkulu
priyunido nippu ḍiṭṭĕ pĕṁchanem̐ṭige
dayam̐jūḍu mippuḍe tappulĕṁchagidani
rayamuna niṁtalone rājasamulā
(||aune||)
sevadere siggulu sirunavvumukkulu
śhrī veṁkaḍeśhvaru mīm̐dam̐ jimmeveme
yī vala nidam̐ḍe kūḍĕ yiyyagolugā ninnu
bhāviṁcha nīgidi nem̐ḍu balubaṁtamā