ఔనే మంచిదానవు అతఁ డటువంటివాఁడా
(॥పల్లవి॥)
ఔనే మంచిదానవు అతఁ డటువంటివాఁడా
పూని వేఁడుకొనఁగదే పొందుగలవానిని
(॥ఔనే॥)
కన్నులు గొప్పలంటాను కడుజింకింతురటవే
మన్నించి నిన్నేలినమగవానిని
సన్నలు నేరుతునంటా సాదింతురటవే
ఇన్నిట జాణఁడఇనఇటువంటివానిని
(॥ఔనే॥)
వాఁటములు చేతులంటా వడిఁ బెనఁగుదురటే
మేటితనాన నుండేటిమేనవానిని
మాటలు నేరుతునంటా మగుడ నాడుదురటే
కూటమికి గురుతైన కొండవంటివానిని
(॥ఔనే॥)
చన్నులు గట్టులంటాను జడియ బిగింతురటే
విన్నాణపునేర్పుల శ్రీవేంకటేశుని
కిన్నెరకు నేర్తునంటా గీఁటి చూపుదురటే
పన్నినట్టి వలపులపట్టమేలేవానిని
(||pallavi||)
aune maṁchidānavu adam̐ ḍaḍuvaṁṭivām̐ḍā
pūni vem̐ḍugŏnam̐gade pŏṁdugalavānini
(||aune||)
kannulu gŏppalaṁṭānu kaḍujiṁkiṁturaḍave
manniṁchi ninnelinamagavānini
sannalu nerudunaṁṭā sādiṁturaḍave
inniḍa jāṇam̐ḍa̮ina̮iḍuvaṁṭivānini
(||aune||)
vām̐ṭamulu sedulaṁṭā vaḍim̐ bĕnam̐guduraḍe
meḍidanāna nuṁḍeḍimenavānini
māḍalu nerudunaṁṭā maguḍa nāḍuduraḍe
kūḍamigi gurudaina kŏṁḍavaṁṭivānini
(||aune||)
sannulu gaṭṭulaṁṭānu jaḍiya bigiṁturaḍe
vinnāṇabunerbula śhrīveṁkaḍeśhuni
kinnĕragu nerdunaṁṭā gīm̐ṭi sūbuduraḍe
panninaṭṭi valabulabaṭṭamelevānini