Aune aune aayam bani

ఔనే ఔనే ఆయఁ బని
Language

(॥పల్లవి॥)
ఔనే ఔనే ఆయఁ బని
పూని వలపు మోఁపి పోయీనా తాను

(॥ఔనే॥)
మగిడిమగిడి మమ్ముఁ జూచీనే
మిగులఁ దనాస నామీఁదఁ బారెనా
తగవీ నగవూఁ దా నెఱఁగఁడా
సగము నవ్వితి నేను జాణవునే తాను

(॥ఔనే॥)
మలసి మలసి మాఁటాడీనే
అలరి యంతలో నే నాలనైతినా
చలిమి బలిమీ సాదించీనా
యెలమి బలిమీ సాదించీనా

(॥ఔనే॥)
చేరి చేరి చేయి వేసినే యిట్టె
సారెకు ననుఁ గూడి చవిగనెనా
రారె వావిలిపాటిరాఘవుఁడు
ఈరీతి శ్రీ వేంకటేశుఁడే తాను

(||pallavi||)
aune aune āyam̐ bani
pūni valabu mom̐pi poyīnā tānu

(||aune||)
magiḍimagiḍi mammum̐ jūsīne
migulam̐ danāsa nāmīm̐dam̐ bārĕnā
tagavī nagavūm̐ dā nĕṟam̐gam̐ḍā
sagamu navvidi nenu jāṇavune tānu

(||aune||)
malasi malasi mām̐ṭāḍīne
alari yaṁtalo ne nālanaidinā
salimi balimī sādiṁchīnā
yĕlami balimī sādiṁchīnā

(||aune||)
seri seri seyi vesine yiṭṭĕ
sārĕgu nanum̐ gūḍi saviganĕnā
rārĕ vāvilibāḍirāghavum̐ḍu
īrīdi śhrī veṁkaḍeśhum̐ḍe tānu