ఔనయ్యా మంచివాఁడు వతివ నింత సేసితి
(॥పల్లవి॥)
ఔనయ్యా మంచివాఁడు వతివ నింత సేసితి
కానీవయ్యా యీకె నిట్టె కరుణించు మిఁకను
(॥॥)
మనసిచ్చినీ వాపెతో మాటలాడఁగానేపో
తనివోనివలపులతమి వుట్టెను
కనుచూపు లటు నీవు కాఁడిపారించఁగాఁబో
కొనసాగి వొక్కొకటె కోరికలు రేఁగెను
(॥॥)
నాముగొన నీ వూరకె నవ్వులు నవ్వఁగాఁబో
మోమున రతికళలు మొలవఁ జొచ్చె
చేముంచి నీవు సారెఁ జెనకఁ గానే పో
యేమినెఱఁగనిబాల ఇంత రట్టుకెక్కెను
(॥॥)
ఇంటికే వచ్చి నీవు ఇట్లాఁ గూడఁగాఁబో
దంటయై ఇంతేసికతలఁ గరఁచె
జంటయై శ్రీవేంకటేశ సరసమాడఁగాఁ బో
పెంటయైన సంతోసాలఁ బెనగొనె నిపుడు
(||pallavi||)
aunayyā maṁchivām̐ḍu vadiva niṁta sesidi
kānīvayyā yīgĕ niṭṭĕ karuṇiṁchu mim̐kanu
(||||)
manasichchinī vābĕdo māḍalāḍam̐gānebo
tanivonivalabuladami vuṭṭĕnu
kanusūbu laḍu nīvu kām̐ḍibāriṁcham̐gām̐bo
kŏnasāgi vŏkkŏgaḍĕ korigalu rem̐gĕnu
(||||)
nāmugŏna nī vūragĕ navvulu navvam̐gām̐bo
momuna radigaḽalu mŏlavam̐ jŏchchĕ
semuṁchi nīvu sārĕm̐ jĕnagam̐ gāne po
yeminĕṟam̐ganibāla iṁta raṭṭugĕkkĕnu
(||||)
iṁṭige vachchi nīvu iṭlām̐ gūḍam̐gām̐bo
daṁṭayai iṁtesigadalam̐ garam̐sĕ
jaṁṭayai śhrīveṁkaḍeśha sarasamāḍam̐gām̐ bo
pĕṁṭayaina saṁtosālam̐ bĕnagŏnĕ nibuḍu