Aunayyaa mamchivaamda vaage sitta meṟamgavu

ఔనయ్యా మంచివాఁడ వాకె చిత్త మెఱఁగవు
Language

(॥పల్లవి॥)
ఔనయ్యా మంచివాఁడ వాకె చిత్త మెఱఁగవు
మానాపతైనదాని మరి రట్టు సేతురా

(॥॥)
సిగ్గరి పెండ్లి కూఁతురై శిరసువంచుకుండఁగ
దిగ్గన నొడివట్టేల తీసేవు నీవు
తగ్గి చెలిమఱఁగునఁ దప్పించుకొనఁగానే
వెగ్గళించి గోరుసోఁక వేఁడుకొనేవు

(॥॥)
కడలేనిముద్దరాలై కంబమువట్టుకుండఁగా
అడరి కూచుండుమంటా నానవేట్టేవు
చిడుముడితోడ నీకుఁ జేతులెత్తి మొక్కఁగానే
గుడిగొనఁ బయ్యదకొంగు జారించేవు

(॥॥)
పట్టపుదేవులై బడివాయకుండఁగానే
జట్టిగొని తొడమీఁదఁ బెట్టుకొనేవు
ఇట్టె శ్రీవేంకటేశ యీకె నిన్నుఁ గూడఁగానె
చుట్టరికాలెల్లాఁ జెప్పి చొక్కించేవు

(||pallavi||)
aunayyā maṁchivām̐ḍa vāgĕ sitta mĕṟam̐gavu
mānābadainadāni mari raṭṭu sedurā

(||||)
siggari pĕṁḍli kūm̐turai śhirasuvaṁchuguṁḍam̐ga
diggana nŏḍivaṭṭela tīsevu nīvu
taggi sĕlimaṟam̐gunam̐ dappiṁchugŏnam̐gāne
vĕggaḽiṁchi gorusom̐ka vem̐ḍugŏnevu

(||||)
kaḍalenimuddarālai kaṁbamuvaṭṭuguṁḍam̐gā
aḍari kūsuṁḍumaṁṭā nānaveṭṭevu
siḍumuḍidoḍa nīgum̐ jedulĕtti mŏkkam̐gāne
guḍigŏnam̐ bayyadagŏṁgu jāriṁchevu

(||||)
paṭṭabudevulai baḍivāyaguṁḍam̐gāne
jaṭṭigŏni tŏḍamīm̐dam̐ bĕṭṭugŏnevu
iṭṭĕ śhrīveṁkaḍeśha yīgĕ ninnum̐ gūḍam̐gānĕ
suṭṭarigālĕllām̐ jĕppi sŏkkiṁchevu