Aunayya mari yaduganemtigi

ఔనయ్య మరి యడుగనేఁటికి
Language

(॥పల్లవి॥)
ఔనయ్య మరి యడుగనేఁటికి
నాని వయసులు నయము లెచ్చె

(॥ఔన॥)
కొలువులోపల కొమ్మ మాఁటాడితే
నిలువెల్లా నిదె నీకుఁ జెమరించె
చెలు అది చూచి సిగ్గులు పడిరి
చలి వాసె నేఁడు జంటవలపు

(॥ఔన॥)
సరసము నీతో పతి యాడితేను
గొరబాయ నీమెయి గోరిచెనకులు
పోరుగువారెల్ల చూచిరి
తెర దీసె నిదె తెగ నాసలు

(॥ఔన॥)
కాఁగిటిలో నిన్ను కాంత గూడితేను
మాఁగి నీమోవి మంచితేనె చిందె
ఆఁగిరి శ్రీవేంకటాధిప సవతులె
యేఁగుఁబెఁడ్లి సేసె నీడనే రతుల

(||pallavi||)
aunayya mari yaḍuganem̐ṭigi
nāni vayasulu nayamu lĕchchĕ

(||auna||)
kŏluvulobala kŏmma mām̐ṭāḍide
niluvĕllā nidĕ nīgum̐ jĕmariṁchĕ
sĕlu adi sūsi siggulu paḍiri
sali vāsĕ nem̐ḍu jaṁṭavalabu

(||auna||)
sarasamu nīdo padi yāḍidenu
gŏrabāya nīmĕyi gorisĕnagulu
poruguvārĕlla sūsiri
tĕra dīsĕ nidĕ tĕga nāsalu

(||auna||)
kām̐giḍilo ninnu kāṁta gūḍidenu
mām̐gi nīmovi maṁchidenĕ siṁdĕ
ām̐giri śhrīveṁkaḍādhiba savadulĕ
yem̐gum̐bĕm̐ḍli sesĕ nīḍane radula