Aunayya mamchivaamda vauduvu neevu

ఔనయ్య మంచివాఁడ వౌదువు నీవు
Language

(॥పల్లవి॥)
ఔనయ్య మంచివాఁడ వౌదువు నీవు
కానుక వట్టిన మొక్కుఁ గాదెలఁ బోతురా

(॥ఔన॥)
పేరఁ బిల్చితే వచ్చితిని పెనఁగనేల చెలితో
గోరగీరేపని కిఁక గొడ్డలేఁటికి
సారపు మోవితీపుతో సరిపెట్టేవు తేనెలు
యేరు గుడిచి కాలువ యింత పొగడుదురా

(॥ఔన॥)
ఆసపడి చూడఁగానే ఆడించేవు యెడమాట
చేసన్నవచ్చేపనికి చెట్ట యేఁటికి
యీసతిఁ జూచి యెవ్వతో ఇటులావున్నదనేవు
పూసినగందపుపూఁత పుప్పొడిఁ బోలుతురా

(॥ఔన॥)
నగినమాటలలోన నలుసులు వెదకేవు
తగులాటాలై నమీఁద తగవేఁటికి
జిగిమీరి కూడితివి శ్రీవేంకటేశ ఇంతిని
చిగిరించితే మరి చెట్టుగట్టుకుండునా

(||pallavi||)
aunayya maṁchivām̐ḍa vauduvu nīvu
kānuga vaṭṭina mŏkkum̐ gādĕlam̐ bodurā

(||auna||)
peram̐ bilside vachchidini pĕnam̐ganela sĕlido
goragīrebani kim̐ka gŏḍḍalem̐ṭigi
sārabu movidībudo saribĕṭṭevu tenĕlu
yeru guḍisi kāluva yiṁta pŏgaḍudurā

(||auna||)
āsabaḍi sūḍam̐gāne āḍiṁchevu yĕḍamāḍa
sesannavachchebanigi sĕṭṭa yem̐ṭigi
yīsadim̐ jūsi yĕvvado iḍulāvunnadanevu
pūsinagaṁdabubūm̐ta puppŏḍim̐ boludurā

(||auna||)
naginamāḍalalona nalusulu vĕdagevu
tagulāḍālai namīm̐da tagavem̐ṭigi
jigimīri kūḍidivi śhrīveṁkaḍeśha iṁtini
sigiriṁchide mari sĕṭṭugaṭṭuguṁḍunā