Aunadave imkaa nemamdune nenu

ఔనటవే ఇంకా నేమందునే నేను
Language

(॥పల్లవి॥)
ఔనటవే ఇంకా నేమందునే నేను
వైనవైనాలుగా నన్నీ వా(వ్రా?)సిత్తునటవే

(॥ఔన॥)
చెల్లునే తాఁజేసినచేఁతలెల్లాను
వెల్లవిరాయఁ బనులు వేగినంతాను
కల్లలూఁగానే తన చక్కనిమాఁటలూ
పల్లదాన నన్నిటాను పంతగాఁడే తాను

(॥ఔన॥)
మెచ్చిరే యందరూఁ దనమేకులెల్లాను
పచ్చితనమెల్లా బంగారాయనే
తచ్చనలూఁగావే తన తగవులునూ
వొచ్చెములేని గుణాల వొరపరే తానూ

(॥ఔన॥)
దక్కెనే తనకు మంచితనమెల్లాను
మొక్కినట్టే వరమిచ్చె ముమ్మాటికిని
యిక్కువతో నన్నుఁ గూడి యిచ్చె మేలెల్లా
వెక్కసపు శ్రీవేంకటవిభుఁడే తానూ

(||pallavi||)
aunaḍave iṁkā nemaṁdune nenu
vainavainālugā nannī vā(vrā?)sittunaḍave

(||auna||)
sĕllune tām̐jesinasem̐talĕllānu
vĕllavirāyam̐ banulu veginaṁtānu
kallalūm̐gāne tana sakkanimām̐ṭalū
palladāna nanniḍānu paṁtagām̐ḍe tānu

(||auna||)
mĕchchire yaṁdarūm̐ danamegulĕllānu
pachchidanamĕllā baṁgārāyane
tachchanalūm̐gāve tana tagavulunū
vŏchchĕmuleni guṇāla vŏrabare tānū

(||auna||)
dakkĕne tanagu maṁchidanamĕllānu
mŏkkinaṭṭe varamichchĕ mummāḍigini
yikkuvado nannum̐ gūḍi yichchĕ melĕllā
vĕkkasabu śhrīveṁkaḍavibhum̐ḍe tānū