(॥పల్లవి॥)
ఔఁగాదనలే మంతటి నిను నిటు
దాఁగిన నీ వలపున తలఁపించదుగా
(॥ఔగా॥)
నిలువునఁ గరఁగి నివ్వెరగంది
నెలఁత వుస్సురనీ నీకుఁగానే
తలఁచవు తాఁకవు దగ్గరిరా విటు
పెలుచుమరుఁడైనాఁ బెరరేఁచఁడుగా
(॥ఔగా॥)
చెమటలఁ దోఁగి చింతల మునిఁగి
తమకము మీఁదెత్తెఁ దరుణి నీకే
తెమలవు తెరలవు దిష్టించిచూడవు
జమళివయసులైన చవిపుట్టించదుగా
(॥ఔగా॥)
యెదురుగ నేతెంచి నెడమాటలాడించి
కదిసి నిన్నింతలోనే కాఁగిలించీ
చెదరవు బెదరవు శ్రీవేంకటేశ యీకె
పొదిగినకూటమైనా పోదిసేయదుగా
(||pallavi||)
aum̐gādanale maṁtaḍi ninu niḍu
dām̐gina nī valabuna talam̐piṁchadugā
(||augā||)
niluvunam̐ garam̐gi nivvĕragaṁdi
nĕlam̐ta vussuranī nīgum̐gāne
talam̐savu tām̐kavu daggarirā viḍu
pĕlusumarum̐ḍainām̐ bĕrarem̐sam̐ḍugā
(||augā||)
sĕmaḍalam̐ dom̐gi siṁtala munim̐gi
tamagamu mīm̐dĕttĕm̐ daruṇi nīge
tĕmalavu tĕralavu diṣhṭiṁchisūḍavu
jamaḽivayasulaina savibuṭṭiṁchadugā
(||augā||)
yĕduruga nedĕṁchi nĕḍamāḍalāḍiṁchi
kadisi ninniṁtalone kām̐giliṁchī
sĕdaravu bĕdaravu śhrīveṁkaḍeśha yīgĕ
pŏdiginagūḍamainā podiseyadugā