ఔలేరా గుణము అలిగిన వానివలె
(॥పల్లవి॥)
ఔలేరా గుణము అలిగిన వానివలె
తేలించె నీ తమకము తెలిసెఁబో నాకును
(॥ఔలే॥)
సుద్దులు చెప్ప వదేర సారిది నీమోవి మీఁద
అద్దిన కెంపులు రాఁగీనని యంటానో
అద్దొ కన్నులఁ జూచి ఆదరించ వదేర
నిద్దుర కన్నుఁగొనల నిండెనంటానో
(॥ఔలే॥)
దగ్గరి కూచుండవేర తగు వింతవాసనలు
బగ్గన నా మీఁద నిట్టె పారీనంటానో
సిగ్గునఁ దలవంచేవు చెల్లఁబో నీవిదియేర
అగ్గలపు మోము కళ లవి గనేనంటానో
(॥ఔలే॥)
కాఁగిలించవదియేర గక్కున నేఁ గూడఁగాను
కాఁగిన నీమేని కాఁక గనేనంటానో
వీఁగక శ్రీవేంకటాద్ది విభుఁడ కూడితి రతి
మాఁగిననే నలమేలుమంగ నంటానో
(||pallavi||)
aulerā guṇamu aligina vānivalĕ
teliṁchĕ nī tamagamu tĕlisĕm̐bo nāgunu
(||aule||)
suddulu sĕppa vadera sāridi nīmovi mīm̐da
addina kĕṁpulu rām̐gīnani yaṁṭāno
addŏ kannulam̐ jūsi ādariṁcha vadera
niddura kannum̐gŏnala niṁḍĕnaṁṭāno
(||aule||)
daggari kūsuṁḍavera tagu viṁtavāsanalu
baggana nā mīm̐da niṭṭĕ pārīnaṁṭāno
siggunam̐ dalavaṁchevu sĕllam̐bo nīvidiyera
aggalabu momu kaḽa lavi ganenaṁṭāno
(||aule||)
kām̐giliṁchavadiyera gakkuna nem̐ gūḍam̐gānu
kām̐gina nīmeni kām̐ka ganenaṁṭāno
vīm̐gaga śhrīveṁkaḍāddi vibhum̐ḍa kūḍidi radi
mām̐ginane nalamelumaṁga naṁṭāno