Aubhalesha vomgunoodu laubhalesha

ఔభలేశ వోఁగునూతు లౌభలేశ
Language

(॥పల్లవి॥)
ఔభలేశ వోఁగునూతు లౌభలేశ
శోభనము నీకు నాకు జోడుగూడెఁ గాదా

(॥ఔభ॥)
వున్నతి గిరు లెక్కితి వోఁగునూఁతులౌభళేశ
యెన్నిక నాకుచగిరు లెక్కరాదా
యెన్నఁగ నిట్టూరుపులతో యేఁటికైనా నలసేపు
అన్నిటా నారతులలో నలయరాదా

(॥ఔభ॥)
ఆకసము మోవ రూప మందితి విందరిలోన
ఆకసము నానడుము నంటరాదా
పైకొని వెన్నెలలోనఁ బతి గాఁగ నవ్వేవు
మేకొని నాసరసాన మించి నవ్వరాదా

(॥ఔభ॥)
తెరచి నోరు ముయ్యవు తియ్యని ఆసలతోడ
సొరది నామోవి చవిచూడరాదా
అరిది శ్రీ వేంకటాద్రి నటు గూడి నేఁడీడ
నరసింహరూపమైతి నాటకము గాదా

(||pallavi||)
aubhaleśha vom̐gunūdu laubhaleśha
śhobhanamu nīgu nāgu joḍugūḍĕm̐ gādā

(||aubha||)
vunnadi giru lĕkkidi vom̐gunūm̐tulaubhaḽeśha
yĕnniga nāgusagiru lĕkkarādā
yĕnnam̐ga niṭṭūrubulado yem̐ṭigainā nalasebu
anniḍā nāradulalo nalayarādā

(||aubha||)
āgasamu mova rūba maṁdidi viṁdarilona
āgasamu nānaḍumu naṁṭarādā
paigŏni vĕnnĕlalonam̐ badi gām̐ga navvevu
megŏni nāsarasāna miṁchi navvarādā

(||aubha||)
tĕrasi noru muyyavu tiyyani āsaladoḍa
sŏradi nāmovi savisūḍarādā
aridi śhrī veṁkaḍādri naḍu gūḍi nem̐ḍīḍa
narasiṁharūbamaidi nāḍagamu gādā