అట్టె నిన్నుఁ జూచి అరుదయ్యీ నా కప్పట నుండి
(॥పల్లవి॥)
అట్టె నిన్నుఁ జూచి అరుదయ్యీ నా కప్పట నుండి
కట్టుకొని వలపెంత గాదెఁబోసేవే
(॥అట్టె॥)
పెదవిపై తమ్ములము చేఁటులు రాలఁగాను
కదిసి విభుని కేమి కత చెప్పేవే
అదరు గుబ్బలపై పయ్యద వెడజారఁగా
యెదుటనుండి యాసలు యెంత చూపేవే
(॥అట్టె॥)
వూని చెమటలు మేన నూరుచు వడియఁగాను
పానుపుపై నుండి యేమి పాదాలొత్తేవే
పూనిన కొప్పు విరులు భుజాల పై రాలఁగా
మోనానఁ దప్పక యిట్టె మోమెంత చూచేవే
(॥అట్టె॥)
కరములు చాఁచుకొంటా కాఁగిటిలోఁ బెనఁగుతా
సరికిబేసికి నేమి సాము సేసేవే
యిరవై శ్రివేంకటేశుఁ డేలె నలమేల్మంగను
వరుసకు నీవెంతవడి నాసపడేవే
(||pallavi||)
aṭṭĕ ninnum̐ jūsi arudayyī nā kappaḍa nuṁḍi
kaṭṭugŏni valabĕṁta gādĕm̐boseve
(||aṭṭĕ||)
pĕdavibai tammulamu sem̐ṭulu rālam̐gānu
kadisi vibhuni kemi kada sĕppeve
adaru gubbalabai payyada vĕḍajāram̐gā
yĕduḍanuṁḍi yāsalu yĕṁta sūbeve
(||aṭṭĕ||)
vūni sĕmaḍalu mena nūrusu vaḍiyam̐gānu
pānububai nuṁḍi yemi pādālŏtteve
pūnina kŏppu virulu bhujāla pai rālam̐gā
monānam̐ dappaga yiṭṭĕ momĕṁta sūseve
(||aṭṭĕ||)
karamulu sām̐sugŏṁṭā kām̐giḍilom̐ bĕnam̐gudā
sarigibesigi nemi sāmu seseve
yiravai śhriveṁkaḍeśhum̐ ḍelĕ nalamelmaṁganu
varusagu nīvĕṁtavaḍi nāsabaḍeve