Atte kaasugunnadaana nappadanumdi

అట్టె కాచుకున్నదాన నప్పటనుండి
Language

(॥పల్లవి॥)
అట్టె కాచుకున్నదాన నప్పటనుండి
గట్టువాయతనమేల కరుణించరాదా

(॥అట్టె॥)
వాసితో నీసేవ సేయవచ్చి నేఁ గాచుకుండఁగా
ఆసలనే పెట్టేవు అప్పటనుండి
సేస నీపై నేఁ బెట్టఁగా చెమరించె నామేను
గాసిఁ బెట్ట కిఁకనైనాఁ గరుణించరాదా

(॥అట్టె॥)
పాయలేక నీకొంగుపట్టి నేఁ బెనఁగఁగాను
ఆయితాలే సేసేవు అప్పటనుండి
చేయి నీపైఁ జాఁచఁగాను చిమ్మి రేఁగె మైఁగాక
కాయకపు మాటలేల కరుణించరాదా

(॥అట్టె॥)
కందువనుండి నే నిన్నుఁ గాఁగిట(టి?)కిఁ బిలిచితే
అందాలుగా నవ్వు నవ్వే వప్పటనుండి
పొందితి విప్పుడు నన్ను పొసఁగ శ్రీ వేంకటేశ
కందుదేరె నిఁక నిట్టె కరుణించరాదా

(||pallavi||)
aṭṭĕ kāsugunnadāna nappaḍanuṁḍi
gaṭṭuvāyadanamela karuṇiṁcharādā

(||aṭṭĕ||)
vāsido nīseva seyavachchi nem̐ gāsuguṁḍam̐gā
āsalane pĕṭṭevu appaḍanuṁḍi
sesa nībai nem̐ bĕṭṭam̐gā sĕmariṁchĕ nāmenu
gāsim̐ bĕṭṭa kim̐kanainām̐ garuṇiṁcharādā

(||aṭṭĕ||)
pāyalega nīgŏṁgubaṭṭi nem̐ bĕnam̐gam̐gānu
āyidāle sesevu appaḍanuṁḍi
seyi nībaim̐ jām̐sam̐gānu simmi rem̐gĕ maim̐gāga
kāyagabu māḍalela karuṇiṁcharādā

(||aṭṭĕ||)
kaṁduvanuṁḍi ne ninnum̐ gām̐giḍa(ṭi?)kim̐ biliside
aṁdālugā navvu navve vappaḍanuṁḍi
pŏṁdidi vippuḍu nannu pŏsam̐ga śhrī veṁkaḍeśha
kaṁduderĕ nim̐ka niṭṭĕ karuṇiṁcharādā