Atte kaaneeleve adam dimteyittasese

అట్టె కానీలేవే అతఁ డింతేయిత్తసేసె
Language

(॥పల్లవి॥)
అట్టె కానీలేవే అతఁ డింతేయిత్తసేసె
నెట్టన నే నిన్నాళ్ళు నిన్నెఱఁగనా

(॥అట్టె॥)
జడియుచు మరిసేవు సవతుల యెదుటనే
కడలేని సంపదల గర్వమా యిది
బడిబడి నందరిలో పంతములే నెరపేవు
వొడలిలో వుప్పలిల్లేవుదుటా యిది

(॥అట్టె॥)
దొరకొని కెలసేవు తోడివారు వినఁగానే
మరు తంత్రములోని మదమా యిది
పరగ బంగారుపీఁటపయి విఱ్ఱవీఁగేవు
కరఁగిన మనసులో గజరా యిది

(॥అట్టె॥)
కూడి శ్రీవేంకటపతిఁ గొసరేవు మాయెదుట
జాడల నీతఁడిచ్చిన సలిగా యిది
వోడక యక్కచెల్లెండ్ల రొమ్మ సమ్మతిసేసేవు
నీడల నేనేర్చిననేరుపా యిది

(||pallavi||)
aṭṭĕ kānīleve adam̐ ḍiṁteyittasesĕ
nĕṭṭana ne ninnāḽḽu ninnĕṟam̐ganā

(||aṭṭĕ||)
jaḍiyusu marisevu savadula yĕduḍane
kaḍaleni saṁpadala garvamā yidi
baḍibaḍi naṁdarilo paṁtamule nĕrabevu
vŏḍalilo vuppalillevuduḍā yidi

(||aṭṭĕ||)
dŏragŏni kĕlasevu toḍivāru vinam̐gāne
maru taṁtramuloni madamā yidi
paraga baṁgārubīm̐ṭabayi viṭravīm̐gevu
karam̐gina manasulo gajarā yidi

(||aṭṭĕ||)
kūḍi śhrīveṁkaḍabadim̐ gŏsarevu māyĕduḍa
jāḍala nīdam̐ḍichchina saligā yidi
voḍaga yakkasĕllĕṁḍla rŏmma sammadisesevu
nīḍala nenersinanerubā yidi