Atte kaadaa aasa nee kemto

అట్టె కాదా ఆస నీ కెంతో
Language

(॥పల్లవి॥)
అట్టె కాదా ఆస నీ కెంతో
యెట్టుక యితనికి నీవొక్కెతవా

(॥అట్టె॥)
వాలుకచూపులు వంచితివి గదవే
యేలిన రమణుఁడు యేమనెనే
కోలుముందుగాఁ గోపములేలే
తాలిమి మా కిటు దయివారఁగాను

(॥అట్టె॥)
కొంచెపు మాఁటలఁ గొసరితివి గదవే
యించుక రమణుఁడు యేమనెనే
మంచమెక్కి మరి మంకు లదేలే
పొంచుక నేమెల్లా బొందితి మిదివో

(॥అట్టె॥)
కులికి కులికి రతిఁ గూడితివి గదవే
యెలయించిన పతి యేమనెనే
కలసితిమి శ్రీ వేంకటపతి నతనినే
వలపులుమాకును వంతాయ నిపుడు

(||pallavi||)
aṭṭĕ kādā āsa nī kĕṁto
yĕṭṭuga yidanigi nīvŏkkĕdavā

(||aṭṭĕ||)
vālugasūbulu vaṁchidivi gadave
yelina ramaṇum̐ḍu yemanĕne
kolumuṁdugām̐ gobamulele
tālimi mā kiḍu dayivāram̐gānu

(||aṭṭĕ||)
kŏṁchĕbu mām̐ṭalam̐ gŏsaridivi gadave
yiṁchuga ramaṇum̐ḍu yemanĕne
maṁchamĕkki mari maṁku ladele
pŏṁchuga nemĕllā bŏṁdidi midivo

(||aṭṭĕ||)
kuligi kuligi radim̐ gūḍidivi gadave
yĕlayiṁchina padi yemanĕne
kalasidimi śhrī veṁkaḍabadi nadanine
valabulumāgunu vaṁtāya nibuḍu