Attamgaaru vachchudaamkaa nanamgumtini

అత్తఁగారు వచ్చుదాఁకా నణఁగుంటిని
Language

(॥పల్లవి॥)
అత్తఁగారు వచ్చుదాఁకా నణఁగుంటిని
యెత్తిన కోపముతోడ యేమందునే

(॥అత్త॥)
యేకతమాడినదాఁకా నిద్దరివేళ గాచుక
వాకునిష్ఠూర మాడక వాకిట నుంటి
మేకులన్నియుఁ జూచి మెచ్చులు మెచ్చుతా నుంటి
యీకడ మంచితనము లెందాఁకనే

(॥అత్త॥)
నవ్వు ముగిసిన దాకా ననుపుసేసుక వుంటి
పవ్వళించుండఁగా నెగ్గుపట్టక వుంటి
పువ్వులు లోని కంపిత భోగించుమని యంటి
యెవ్వరిబుద్దులు వినే దెందాఁకనే

(॥అత్త॥)
తానే విచ్చేసినదాఁక ననుపుసేసుక వుంటి
ఆనెలఁత మొక్కఁగాను ఆవునంటిని
వూని శ్రీవెంకటేశుఁడు పొందె నింతలో నన్ను
యేనేరమి లేదు చల మెందాఁకనే

(||pallavi||)
attam̐gāru vachchudām̐kā naṇam̐guṁṭini
yĕttina kobamudoḍa yemaṁdune

(||atta||)
yegadamāḍinadām̐kā niddariveḽa gāsuga
vāguniṣhṭhūra māḍaga vāgiḍa nuṁṭi
megulanniyum̐ jūsi mĕchchulu mĕchchudā nuṁṭi
yīgaḍa maṁchidanamu lĕṁdām̐kane

(||atta||)
navvu mugisina dāgā nanubusesuga vuṁṭi
pavvaḽiṁchuṁḍam̐gā nĕggubaṭṭaga vuṁṭi
puvvulu loni kaṁpida bhogiṁchumani yaṁṭi
yĕvvaribuddulu vine dĕṁdām̐kane

(||atta||)
tāne vichchesinadām̐ka nanubusesuga vuṁṭi
ānĕlam̐ta mŏkkam̐gānu āvunaṁṭini
vūni śhrīvĕṁkaḍeśhum̐ḍu pŏṁdĕ niṁtalo nannu
yenerami ledu sala mĕṁdām̐kane