Attaarimtigi ninnettugubodaanugaa

అత్తారింటికి నిన్నెత్తుకుపోతానుగా
Work
Year
Language

పల్లవి:

ముత్తైదులంతా ముదమార ఈ బాలకి
మంగళ స్నానాలు చేయించరే
శ్రీరామ రక్షణని క్షీరాబ్ధి కన్యకి
ముమ్మారు దిష్టి తీసి దీవించరే

మనసు పడే మొగుడొస్తాడని మేనంతా మెరిసింది
మెడిసి పడే మదిలో సందడి మేళాలై మోగింది
నీకు నాకు ముందే రాసింది జోడి
హరిలో రంగ హరి...వహ్వా అంటూ చూస్తోంది పందిరి
బరిలో హోరా హోరి బహు బాగుంది బాజా బాజంతిరి

అత్తారింటికి నిన్నెత్తుకుపోతానుగా...వచ్చనే హంస వైభోగంగా
కన్యాధనమిస్తా కల్యాణం సాక్షిగా...దొరలా దోచుకుపో యమ దర్జాగా

చరణం 1:

గెలిచానే నీ హృదయం కలకాలం ఈ విజయం నీతో పంచుకోనా
ప్రియురాలా నా ప్రాణం నీ పాపిట సింధూరంగా నిలపనా..ఆ..ఆ

కలలన్నీ ఈ నిమిషం నిజమయ్యే సంతోషం నాలో దాచగలనా..ఆ..
దరిచేరే నీ కోసం చిరునవ్వుల నీరాజనం ఇవ్వనా..ఆ..

ముస్తాబు చెయ్యరటే ఈ ముద్దుల గుమ్మని...సిగ్గుపడు చెంపకి సిరి చుక్క దిద్దరే
పట్టు చేర కట్టరటే ఈ పుత్తడి బొమ్మకి...తడబడు కాళ్ళకి పారాణి పెట్టరే

వగలన్నీ నిగనిగలాడవా నన్నల్లే కౌగిళ్ళో
నగలన్నీ వెలవెలబోవా చేరందే నీ వోళ్ళో
నాకే సొంతం కానీ నీ సొమ్ములన్నీ..

హరిలో రంగ హరి..వహ్వా అంటూ చూస్తోంది పందిరి
బరిలో హోరా హోరి బహు బాగుంది బాజా బాజంతిరి

అత్తారింటికి నిన్నెత్తుకుపోతానుగా వచ్చనే హంస వైభోగంగా
కన్యాధనమిస్తా కల్యాణం సాక్షిగా దొరలా దోచుకుపో యమ దర్జాగా

చరణం 2:

ఒట్టేసి చెబుతున్నా కడదాకా నడిపించే తోడై నేనున్నా
ఏడడుగుల పయనాన ఏడేడు లోకాలైనా దాటనా...

వధువై ఎదురొస్తున్నా వరమాలై ఎదపైన వాలే ముహూర్తాన
వరసయ్యే వలపంతా చదివిస్తా వరకట్నంగా సరేనా...

ముక్కోటి దేవతలు మక్కువగా కలిపారే...ఎన్నెన్ని జన్మలదో ఈ కొంగుముడి
ముత్యాల జల్లుగా అక్షింతలు వేయ్యాలే..ముచ్చట తీరేలా అంతా రండి

ఏనాడూ ఎవరూ చేరని ఏకాంతం వెతకాలి..
ఏ కన్నూ ఎపుడూ చూడని లోకంలో బతకాలి...
పగలు రేయి లేని జగమేలుకోని
హరిలో రంగ హరి..వహ్వా అంటూ చూస్తోంది పందిరి
బరిలో హోరా హోరి బహు బాగుంది బాజా బాజంతిరి

అత్తారింటికి నిన్నెత్తుకుపోతానుగా వచ్చనే హంస వైభోగంగా
కన్యాధనమిస్తా కల్యాణం సాక్షిగా దొరలా దోచుకుపో యమ దర్జాగా
అత్తారింటికి నిన్నెత్తుకుపోతానుగా వచ్చనే హంస వైభోగంగా
కన్యాధనమిస్తా కల్యాణం సాక్షిగా దొరలా దోచుకుపో యమ దర్జాగా

pallavi:

muttaidulaṁtā mudamāra ī bālagi
maṁgaḽa snānālu seyiṁchare
śhrīrāma rakṣhaṇani kṣhīrābdhi kanyagi
mummāru diṣhṭi tīsi dīviṁchare

manasu paḍe mŏguḍŏstāḍani menaṁtā mĕrisiṁdi
mĕḍisi paḍe madilo saṁdaḍi meḽālai mogiṁdi
nīgu nāgu muṁde rāsiṁdi joḍi
harilo raṁga hari...vahvā aṁṭū sūstoṁdi paṁdiri
barilo horā hori bahu bāguṁdi bājā bājaṁtiri

attāriṁṭigi ninnĕttugubodānugā...vachchane haṁsa vaibhogaṁgā
kanyādhanamistā kalyāṇaṁ sākṣhigā...dŏralā dosugubo yama darjāgā

saraṇaṁ 1:

gĕlisāne nī hṛdayaṁ kalagālaṁ ī vijayaṁ nīdo paṁchugonā
priyurālā nā prāṇaṁ nī pābiḍa siṁdhūraṁgā nilabanā..ā..ā

kalalannī ī nimiṣhaṁ nijamayye saṁtoṣhaṁ nālo dāsagalanā..ā..
darisere nī kosaṁ sirunavvula nīrājanaṁ ivvanā..ā..

mustābu sĕyyaraḍe ī muddula gummani...siggubaḍu sĕṁpagi siri sukka diddare
paṭṭu sera kaṭṭaraḍe ī puttaḍi bŏmmagi...taḍabaḍu kāḽḽagi pārāṇi pĕṭṭare

vagalannī niganigalāḍavā nannalle kaugiḽḽo
nagalannī vĕlavĕlabovā seraṁde nī voḽḽo
nāge sŏṁtaṁ kānī nī sŏmmulannī..

harilo raṁga hari..vahvā aṁṭū sūstoṁdi paṁdiri
barilo horā hori bahu bāguṁdi bājā bājaṁtiri

attāriṁṭigi ninnĕttugubodānugā vachchane haṁsa vaibhogaṁgā
kanyādhanamistā kalyāṇaṁ sākṣhigā dŏralā dosugubo yama darjāgā

saraṇaṁ 2:

ŏṭṭesi sĕbudunnā kaḍadāgā naḍibiṁche toḍai nenunnā
eḍaḍugula payanāna eḍeḍu logālainā dāḍanā...

vadhuvai ĕdurŏstunnā varamālai ĕdabaina vāle muhūrdāna
varasayye valabaṁtā sadivistā varagaṭnaṁgā sarenā...

mukkoḍi devadalu makkuvagā kalibāre...ĕnnĕnni janmalado ī kŏṁgumuḍi
mutyāla jallugā akṣhiṁtalu veyyāle..muchchaḍa tīrelā aṁtā raṁḍi

enāḍū ĕvarū serani egāṁtaṁ vĕdagāli..
e kannū ĕbuḍū sūḍani logaṁlo badagāli...
pagalu reyi leni jagamelugoni