Asurala shikshimcha namarulam baalimcha

అసురల శిక్షించ నమరులఁ బాలించ
Language

(॥పల్లవి॥)
అసురల శిక్షించ నమరులఁ బాలించ
వెసఁ గొలువిమ్మనరే విన్నపాల కాంతలు

(॥అసు॥)
యేకతాన దేవుఁ డున్నా డింతులరతిఁ దగిలి
దాకొనడపసతులు దగ్గరరమ్మ
యీకడ నింతవొద్దు వోయినదీ నెరఁగఁడు
దాకొని జంకముకాంతలు విన్నవించరే

(॥అసు॥)
పూని యిందిరపాటలో నోలలాడుచున్నవాఁడు
బోనపుటింతు లెదుటఁ బొడచూపరే
పానిపట్టి నెత్తమాడేవరాకై వున్నవాఁడు
పూని గడేరమువారు పొంచియెచ్చరించరే

(॥అసు॥)
శ్రీవేంకటేశుఁ డదె శ్రీసతిఁ గూడున్నాఁడు
ఆవేళఁ బూవులు గందా లందియ్యరే
భావించి రాజసాన నభయహస్త మిచ్చినాఁడు
దైవ మాతనినే నమ్మి తరుణలు మొక్కరే

(||pallavi||)
asurala śhikṣhiṁcha namarulam̐ bāliṁcha
vĕsam̐ gŏluvimmanare vinnabāla kāṁtalu

(||asu||)
yegadāna devum̐ ḍunnā ḍiṁtularadim̐ dagili
dāgŏnaḍabasadulu daggararamma
yīgaḍa niṁtavŏddu voyinadī nĕram̐gam̐ḍu
dāgŏni jaṁkamugāṁtalu vinnaviṁchare

(||asu||)
pūni yiṁdirabāḍalo nolalāḍusunnavām̐ḍu
bonabuḍiṁtu lĕduḍam̐ bŏḍasūbare
pānibaṭṭi nĕttamāḍevarāgai vunnavām̐ḍu
pūni gaḍeramuvāru pŏṁchiyĕchchariṁchare

(||asu||)
śhrīveṁkaḍeśhum̐ ḍadĕ śhrīsadim̐ gūḍunnām̐ḍu
āveḽam̐ būvulu gaṁdā laṁdiyyare
bhāviṁchi rājasāna nabhayahasta michchinām̐ḍu
daiva mādanine nammi taruṇalu mŏkkare