Ardhashadaabdabu ajnyaaanaanne svadamtrama&

అర్ధశతాబ్దపు అజ్ఞానాన్నే స్వతంత్రమ&
Work
Year
Language

పల్లవి:

అర్ధశతాబ్దపు అజ్ఞానాన్నే స్వతంత్రమందామా ..స్వర్ణోత్సవాలు చేద్దామా
ఆత్మవినాశపు అరాచకాన్నే స్వరాజ్యమందామా ..దానికే సలాము చేద్దామా
శాంతికపోతపు కుత్తుక తెంచి తెచ్చిన బహుమానం ..ఈ రక్తపు సింధూరం
నీ పాపిటలో భక్తిగా దిద్దిన ప్రజలను చూడమ్మ ..ఓ పవిత్ర భారతమా

అర్ధశతాబ్దపు అజ్ఞానాన్నే స్వతంత్రమందామా ..స్వర్ణోత్సవాలు చేద్దామా
నిత్యం కొట్టుకు చచ్చే జనాల స్వేచ్ఛను చూద్దామా ..దాన్నే స్వరాజ్యమందామా

చరణం 1:

కులాల కోసం గుంపులుకడుతూ మతాల కోసం మంటలు పెడుతూ
ఎక్కడలేని తెగువను చూపి తగువుకు లేస్తారే .. జనాలు తలలర్పిస్తారే
సమూహ క్షేమం పట్టని స్వార్థపు ఇరుకుతనంలో ముడుచుకుపోతూ
మొత్తం దేశం తగలడుతోందని నిజం తెలుసుకోరేం .. తెలిసి భుజం కలిపి రారే
అలాంటి జనాల తరపున ఎవరో ఎందుకు పోరాడాలి ..పోరి ఏమిటి సాధించాలి ?
ఎవ్వరి కోసం ఎవరు ఎవరితో సాగించే సమరం ..ఈ చిచ్చుల సింధూరం !
జవాబు చెప్పే భాద్యత మరచిన జనాల భారతమా ..ఓ అనాథ భారతమా !!

అర్ధశతాబ్దపు అజ్ఞానాన్నే స్వతంత్రమందామా ..స్వర్ణోత్సవాలు చేద్దామా
ఆత్మవినాశపు అరాచకాన్నే స్వరాజ్యమందామా ..దానికే సలాము చేద్దామా

చరణం 2:

అన్యాయాన్ని సహించని శౌర్యం దౌర్జన్యాన్ని దహించే ధైర్యం
కారడవులలో కృరమృగంలా దాక్కుని ఉండాలా ..వెలుగుని తప్పుకు తిరగాలా
శత్రువుతో పోరాడే సైన్యం శాంతిని కాపాడే కర్తవ్యం
స్వజాతి వీరులనణచే విధిలో కవాతు చెయ్యాలా ..అన్నల చేతిలో చావాలా
తనలో ధైర్యం అడవికి ఇచ్చి తన ధర్మం చట్టానికి ఇచ్చి
ఆ కలహం చూస్తూ సంఘం శిలలా నిలిచుంటే
నడిచే శవాల సిగలో తురిమిన నెత్తుటి మందారం ..ఈ సంధ్యా సింధూరం
వేకువ వైపా చీకటిలోకా ఎటు నడిపేవమ్మా ..గతి తోచని భారతమా

అర్ధశతాబ్దపు అజ్ఞానాన్నే స్వతంత్రమందామా ..స్వర్ణోత్సవాలు చేద్దామా
యుద్ధ నినాదపు అరాచకాన్నే స్వరాజ్యమందామా ..దానికి సలాము చేద్దామా

చరణం 3:

తన తలరాతను తనే రాయగల అవకాశాన్నే వదులుకొని
తనలో భీతిని తన అవినీతిని తన ప్రతినిధులుగా ఎన్నుకొని
ప్రజాస్వామ్యమని తలచే జాతిని ప్రశ్నించడమే మానుకొని
కళ్ళు ఉన్న ఈ కబోది జాతిని నడిపిస్తుందట ఆవేశం
ఆ హక్కేదో తనకే వుందని శాసిస్తుందట అధికారం
కృష్ణుడు లేని కురుక్షేత్రమున సాగే ఈ ఘోరం ..చితి మంటల సింధూరం
చూస్తూ ఇంకా నిదురిస్తావా విశాల భారతమా ..ఓ విషాద భారతమా !

pallavi:

ardhaśhadābdabu ajñānānne svadaṁtramaṁdāmā ..svarṇotsavālu seddāmā
ātmavināśhabu arāsagānne svarājyamaṁdāmā ..dānige salāmu seddāmā
śhāṁtigabodabu kuttuga tĕṁchi tĕchchina bahumānaṁ ..ī raktabu siṁdhūraṁ
nī pābiḍalo bhaktigā diddina prajalanu sūḍamma ..o pavitra bhāradamā

ardhaśhadābdabu ajñānānne svadaṁtramaṁdāmā ..svarṇotsavālu seddāmā
nityaṁ kŏṭṭugu sachche janāla svechchhanu sūddāmā ..dānne svarājyamaṁdāmā

saraṇaṁ 1:

kulāla kosaṁ guṁpulugaḍudū madāla kosaṁ maṁṭalu pĕḍudū
ĕkkaḍaleni tĕguvanu sūbi taguvugu lestāre .. janālu talalarbistāre
samūha kṣhemaṁ paṭṭani svārdhabu irugudanaṁlo muḍusugubodū
mŏttaṁ deśhaṁ tagalaḍudoṁdani nijaṁ tĕlusugoreṁ .. tĕlisi bhujaṁ kalibi rāre
alāṁṭi janāla tarabuna ĕvaro ĕṁdugu porāḍāli ..pori emiḍi sādhiṁchāli ?
ĕvvari kosaṁ ĕvaru ĕvarido sāgiṁche samaraṁ ..ī sichchula siṁdhūraṁ !
javābu sĕppe bhādyada marasina janāla bhāradamā ..o anātha bhāradamā !!

ardhaśhadābdabu ajñānānne svadaṁtramaṁdāmā ..svarṇotsavālu seddāmā
ātmavināśhabu arāsagānne svarājyamaṁdāmā ..dānige salāmu seddāmā

saraṇaṁ 2:

anyāyānni sahiṁchani śhauryaṁ daurjanyānni dahiṁche dhairyaṁ
kāraḍavulalo kṛramṛgaṁlā dākkuni uṁḍālā ..vĕluguni tappugu tiragālā
śhatruvudo porāḍe sainyaṁ śhāṁtini kābāḍe kardavyaṁ
svajādi vīrulanaṇase vidhilo kavādu sĕyyālā ..annala sedilo sāvālā
tanalo dhairyaṁ aḍavigi ichchi tana dharmaṁ saṭṭānigi ichchi
ā kalahaṁ sūstū saṁghaṁ śhilalā nilisuṁṭe
naḍise śhavāla sigalo turimina nĕttuḍi maṁdāraṁ ..ī saṁdhyā siṁdhūraṁ
veguva vaibā sīgaḍilogā ĕḍu naḍibevammā ..gadi tosani bhāradamā

ardhaśhadābdabu ajñānānne svadaṁtramaṁdāmā ..svarṇotsavālu seddāmā
yuddha ninādabu arāsagānne svarājyamaṁdāmā ..dānigi salāmu seddāmā

saraṇaṁ 3:

tana talarādanu tane rāyagala avagāśhānne vadulugŏni
tanalo bhīdini tana avinīdini tana pradinidhulugā ĕnnugŏni
prajāsvāmyamani talase jādini praśhniṁchaḍame mānugŏni
kaḽḽu unna ī kabodi jādini naḍibistuṁdaḍa āveśhaṁ
ā hakkedo tanage vuṁdani śhāsistuṁdaḍa adhigāraṁ
kṛṣhṇuḍu leni kurukṣhetramuna sāge ī ghoraṁ ..sidi maṁṭala siṁdhūraṁ
sūstū iṁkā niduristāvā viśhāla bhāradamā ..o viṣhāda bhāradamā !