Appudu manasuvachchu nannidaa neegu

అప్పుడు మనసువచ్చు నన్నిటా నీకు
Language

(॥పల్లవి॥)
అప్పుడు మనసువచ్చు నన్నిటా నీకు
చెప్పరాని మాటలకు చెవియొగ్గేనయ్యా

(॥అప్పు॥)
యేతులకు నీవు నన్ను ఇటు నటుఁ జెనకఁగా
కాతరాన నే నిన్నుఁ గాదందునా
వాతులు మోవఁగ నీకు వలపులు పొంగఁగాను
పోతరించి ఇచ్చకాల పూవుగట్టేనయ్యా

(॥అప్పు॥)
నవ్వులకు నీవు నన్ను నయములఁ దిట్టఁగాను
రవ్వలుగా నే నప్పటి రాఁపుసేతునా
మువ్వంక జవ్వనము మొలకలువెళ్లఁగాను
నివ్వటిల్లఁ జెమటల నీరుగట్టేనయ్యా

(॥అప్పు॥)
చనవు చేసుక నన్ను సమ్మతించఁ గూడగాను
గునిసి వేరే నిన్నుఁ గొసరుదునా
తనివి శ్రీవేంకటేశ తమకపువిందులకు
చనవులనే వుపచారము చెప్పేనయ్యా

(||pallavi||)
appuḍu manasuvachchu nanniḍā nīgu
sĕpparāni māḍalagu sĕviyŏggenayyā

(||appu||)
yedulagu nīvu nannu iḍu naḍum̐ jĕnagam̐gā
kādarāna ne ninnum̐ gādaṁdunā
vādulu movam̐ga nīgu valabulu pŏṁgam̐gānu
podariṁchi ichchagāla pūvugaṭṭenayyā

(||appu||)
navvulagu nīvu nannu nayamulam̐ diṭṭam̐gānu
ravvalugā ne nappaḍi rām̐pusedunā
muvvaṁka javvanamu mŏlagaluvĕḽlam̐gānu
nivvaḍillam̐ jĕmaḍala nīrugaṭṭenayyā

(||appu||)
sanavu sesuga nannu sammadiṁcham̐ gūḍagānu
gunisi vere ninnum̐ gŏsarudunā
tanivi śhrīveṁkaḍeśha tamagabuviṁdulagu
sanavulane vubasāramu sĕppenayyā