అప్పుడేమనేవో అన్నీఁ జూచే నేను
(॥పల్లవి॥)
అప్పుడేమనేవో అన్నీఁ జూచే నేను
తప్పులేదు నీవే నా పంతము చూడవే
(॥అప॥)
చేయివట్టుకొని యేమిచెప్పేవే నాతో మాట
పాయఁడు విభుఁడు నీపై బత్తియంటాను
కాయజకేళికి నాకన్నుసన్నల నీతని
నాయింటికి రప్పించేను నన్నుఁ జూడవే
(॥అప॥)
యెదుటికి వచ్చి సోమ్ము లేమినాకుఁ జాపేవే
యిదివో అతఁడు నాకు నిచ్చెనంటాను
సదరాన నే నాతని జట్టిగొని యేపొద్దుఁ
జెదరక నాసోమ్ముగఁ జేసుకొనేఁ జూడవే
(॥అప॥)
పోలయుచు నాతని నీపొందు లేమిదెలిపేవే
కలసె నిన్నును శ్రీవేంకటేశుఁడంటా
అలమేలుమంగపతియైన యాతఁడే నన్నేలె
యిల నాచెప్పినట్టు సేయించుకొనే జూడవే
(||pallavi||)
appuḍemanevo annīm̐ jūse nenu
tappuledu nīve nā paṁtamu sūḍave
(||aba||)
seyivaṭṭugŏni yemisĕppeve nādo māḍa
pāyam̐ḍu vibhum̐ḍu nībai battiyaṁṭānu
kāyajageḽigi nāgannusannala nīdani
nāyiṁṭigi rappiṁchenu nannum̐ jūḍave
(||aba||)
yĕduḍigi vachchi sommu lemināgum̐ jābeve
yidivo adam̐ḍu nāgu nichchĕnaṁṭānu
sadarāna ne nādani jaṭṭigŏni yebŏddum̐
jĕdaraga nāsommugam̐ jesugŏnem̐ jūḍave
(||aba||)
polayusu nādani nībŏṁdu lemidĕlibeve
kalasĕ ninnunu śhrīveṁkaḍeśhum̐ḍaṁṭā
alamelumaṁgabadiyaina yādam̐ḍe nannelĕ
yila nāsĕppinaṭṭu seyiṁchugŏne jūḍave