అప్పుడే యెగ్గులు వట్టీ నలిగితినా
(॥పల్లవి॥)
అప్పుడే యెగ్గులు వట్టీ నలిగితినా
తప్పకుండా మెదల సూత్రపు బొమ్మనా
(॥అప్పు॥)
యేమన్న నూరకుందాన నిఁక నేమి గావలెనే
దోమటిఁ దా నవ్వితే నే తోడు నవ్వేదా
తా మాటలాడెనంటా దగ్గరి నే మాటలాడ
కోమలమయినపెద్ద కొండసెలనా
(॥అప్పు॥)
తలవంచుకున్నదాన తనతో నేఁ గోపమేదే
నిలిచి తాఁ జూచెనంటా నిక్కి చూచేదా
అలసి తాఁ జేయివేసె అట్టె నేనూఁ జేయివేయ
బలిమిఁ బంతాలతోడ వందమాడేనా
(॥అప్పు॥)
ఆఁగి తనకొమరాఁక నట్టె వుండఁగ తాను
కాఁగిలించినప్పుడే నేఁగాఁగిలించేదా
చేఁగదేరఁ గూడె నిట్టె శ్రీవేంకటేశ్వరుఁడు
యేఁగించె(చ?) వెంట నే యింత తోడునీడనా
(||pallavi||)
appuḍe yĕggulu vaṭṭī naligidinā
tappaguṁḍā mĕdala sūtrabu bŏmmanā
(||appu||)
yemanna nūraguṁdāna nim̐ka nemi gāvalĕne
domaḍim̐ dā navvide ne toḍu navvedā
tā māḍalāḍĕnaṁṭā daggari ne māḍalāḍa
komalamayinabĕdda kŏṁḍasĕlanā
(||appu||)
talavaṁchugunnadāna tanado nem̐ gobamede
nilisi tām̐ jūsĕnaṁṭā nikki sūsedā
alasi tām̐ jeyivesĕ aṭṭĕ nenūm̐ jeyiveya
balimim̐ baṁtāladoḍa vaṁdamāḍenā
(||appu||)
ām̐gi tanagŏmarām̐ka naṭṭĕ vuṁḍam̐ga tānu
kām̐giliṁchinappuḍe nem̐gām̐giliṁchedā
sem̐gaderam̐ gūḍĕ niṭṭĕ śhrīveṁkaḍeśhvarum̐ḍu
yem̐giṁchĕ(sa?) vĕṁṭa ne yiṁta toḍunīḍanā