Appude maṟaduraa amgana sesina melu

అప్పుడే మఱతురా అంగన సేసిన మేలు
Language

(॥పల్లవి॥)
అప్పుడే మఱతురా అంగన సేసిన మేలు
చొప్పులెత్తఁగా నణఁచుట నీవెఱఁగవా

(॥అప్పు॥)
ఆకడ నెవ్వతో నిన్ను నట్టె తుటారాలాడఁగ
యీకె సన్న సేసి మాన్పె నదెఱఁగవా
పైకొని యప్పటి నీపయిఁ జేయిచాఁచఁగాను
చేకొని నీకడ్డమువచ్చినది యెఱఁగవా

(॥అప్పు॥)
కడఁగి యెకతె నీపై గట్టిపూబంతి వేయఁగా
యెడచొచ్చి పట్టుకొనె నిదెఱఁగవా
జడియకంతలో నిన్ను సరిఁ గిందవేసుకొంటే
బెడిదాన నిన్ను మీఁదఁబెట్టినదెఱఁగవా

(॥అప్పు॥)
వొద్దనున్నచెలి నిన్ను వొగిఁ గాఁగిటఁగూడితే
తిద్ది తానూఁ గలసినది యెఱఁగవా
యిద్దరూ నుండఁగానే యిటు నన్ను నేలితివి
బద్దుల శ్రీవేంకటేశ పాడి నీవెఱఁగవా

(||pallavi||)
appuḍe maṟadurā aṁgana sesina melu
sŏppulĕttam̐gā naṇam̐suḍa nīvĕṟam̐gavā

(||appu||)
āgaḍa nĕvvado ninnu naṭṭĕ tuḍārālāḍam̐ga
yīgĕ sanna sesi mānpĕ nadĕṟam̐gavā
paigŏni yappaḍi nībayim̐ jeyisām̐sam̐gānu
segŏni nīgaḍḍamuvachchinadi yĕṟam̐gavā

(||appu||)
kaḍam̐gi yĕgadĕ nībai gaṭṭibūbaṁti veyam̐gā
yĕḍasŏchchi paṭṭugŏnĕ nidĕṟam̐gavā
jaḍiyagaṁtalo ninnu sarim̐ giṁdavesugŏṁṭe
bĕḍidāna ninnu mīm̐dam̐bĕṭṭinadĕṟam̐gavā

(||appu||)
vŏddanunnasĕli ninnu vŏgim̐ gām̐giḍam̐gūḍide
tiddi tānūm̐ galasinadi yĕṟam̐gavā
yiddarū nuṁḍam̐gāne yiḍu nannu nelidivi
baddula śhrīveṁkaḍeśha pāḍi nīvĕṟam̐gavā