అప్పు డేమందువో నీవు అందుకోపితేఁ జెనకు
(॥పల్లవి॥)
అప్పు డేమందువో నీవు అందుకోపితేఁ జెనకు
చెప్పితి మిప్పుడే నీచిత్తము సుమ్మీ
(॥అప॥)
పలికించేవు మామాట పచ్చికప్పురముసుమ్మీ
చెలిమిసేసేవు అది చిగురుసుమ్మీ
వలపించుకొవచ్చేవు వంతుకు నోరూరుఁజుమ్మీ
కలసేవు మాచన్నులు గట్టులుసుమ్మీ
(॥అప॥)
నగించేవు మమ్ముసారె నాము నీపైఁబారుసుమ్మీ
మొగమే చూచేవు కడుఁదగులౌఁజుమ్మీ
సొగిసి మోవెడిగేవు చోక్కుమందులౌఁజుమ్మీ
తగమేలమాడే వదు తలఁబాలౌఁజుమ్మీ
(॥అప॥)
మలసిమైసోఁకించేవు మర్మములు రేఁగుఁజుమ్మీ
బలిమిఁ గూడేవు కళవట్టీఁజుమ్మీ
అలమేలుమంగపతివైన శ్రీవేంకటేశ్వర
ఇల నన్నేలితివి మేలిఁకఁ జూచుకొమ్మీ
(||pallavi||)
appu ḍemaṁduvo nīvu aṁdugobidem̐ jĕnagu
sĕppidi mippuḍe nīsittamu summī
(||aba||)
paligiṁchevu māmāḍa pachchigappuramusummī
sĕlimisesevu adi sigurusummī
valabiṁchugŏvachchevu vaṁtugu norūrum̐jummī
kalasevu māsannulu gaṭṭulusummī
(||aba||)
nagiṁchevu mammusārĕ nāmu nībaim̐bārusummī
mŏgame sūsevu kaḍum̐dagulaum̐jummī
sŏgisi movĕḍigevu sokkumaṁdulaum̐jummī
tagamelamāḍe vadu talam̐bālaum̐jummī
(||aba||)
malasimaisom̐kiṁchevu marmamulu rem̐gum̐jummī
balimim̐ gūḍevu kaḽavaṭṭīm̐jummī
alamelumaṁgabadivaina śhrīveṁkaḍeśhvara
ila nannelidivi melim̐kam̐ jūsugŏmmī