అప్పటికప్పుడే కాక ఆస లింతేలే
(॥పల్లవి॥)
అప్పటికప్పుడే కాక ఆస లింతేలే
కప్పురమే గనమైతే కాయమున కితవా
(॥అప్ప॥)
ఆలసి నిద్రించఁబోతే ఆడకేల రమ్మనీనే
వలసినప్పుడే నేనే వచ్చేఁగాక
బలుదొర దానైతే బతుకనీ మాకేమీ
బలిమిఁ బిసుకఁబోతే పసురౌఁబో విరులు
(॥అప్ప॥)
ఇంత నే మోనానుంటే యేల మాటాడించీనే
పంతము చెల్లినమీఁదఁ బలికేఁగాక
అంతజాణ దానైతే అవుఁగాక మాకేమి
చెంతఁ గడుఁ గరఁచితేఁ జేదౌఁబో తేనెలు
(॥అప్ప॥)
యెదురుగా రాఁగానే యేల కొంగువట్టీనే
కొదదీరఁ దనతో నే గూడేఁగాక
అదన శ్రీవేంకటేశుఁడైతేఁ దానౌఁగాక
వెదకి నన్ను మన్నించె విరివవుఁ బనులు
(||pallavi||)
appaḍigappuḍe kāga āsa liṁtele
kappurame ganamaide kāyamuna kidavā
(||appa||)
ālasi nidriṁcham̐bode āḍagela rammanīne
valasinappuḍe nene vachchem̐gāga
baludŏra dānaide baduganī māgemī
balimim̐ bisugam̐bode pasuraum̐bo virulu
(||appa||)
iṁta ne monānuṁṭe yela māḍāḍiṁchīne
paṁtamu sĕllinamīm̐dam̐ baligem̐gāga
aṁtajāṇa dānaide avum̐gāga māgemi
sĕṁtam̐ gaḍum̐ garam̐sidem̐ jedaum̐bo tenĕlu
(||appa||)
yĕdurugā rām̐gāne yela kŏṁguvaṭṭīne
kŏdadīram̐ danado ne gūḍem̐gāga
adana śhrīveṁkaḍeśhum̐ḍaidem̐ dānaum̐gāga
vĕdagi nannu manniṁchĕ virivavum̐ banulu