Appadi vatturugaani aadanumdi yeedagu

అప్పటి వత్తురుగాని ఆడనుండి యీడకు
Language

(॥పల్లవి॥)
అప్పటి వత్తురుగాని ఆడనుండి యీడకు
యెప్పుడు మాయిల్లె మీకు నిక్కువైన చోటు

(॥అప్ప॥)
యెంతపని గలిగెనో యేకతమాడీ నాకె
వింతలుసేయక నీవు వినరాదా
కాంత యప్పటనుండి కాచుకున్న దిందుకే
యింతటఁ దెరలోనికి నిద్దరు నేఁగరయ్యా

(॥అప్ప॥)
పట్టుకున్నది కానుక పయ్యద మూసీ యేఁటిదో
అట్టె చేతులుచాఁచి అందుకోరాదా
చుట్టిచుట్టి లాచీని సుదతి తా నిందుకే
ఇట్టె కంబముమాఁటు కిద్దరు నేఁగరయ్యా

(॥అప్ప॥)
యేపున సన్నలుచేసి నెందుకో యలమేల్మంగ
చూపుల శ్రీవేంకటేశ చూడరాదా
యీపట్టున నన్నేలితి వింతి గోరినందుకే
యేఁపక నామంచముపై కిద్దరు నేఁగరయ్యా

(||pallavi||)
appaḍi vatturugāni āḍanuṁḍi yīḍagu
yĕppuḍu māyillĕ mīgu nikkuvaina soḍu

(||appa||)
yĕṁtabani galigĕno yegadamāḍī nāgĕ
viṁtaluseyaga nīvu vinarādā
kāṁta yappaḍanuṁḍi kāsugunna diṁduge
yiṁtaḍam̐ dĕralonigi niddaru nem̐garayyā

(||appa||)
paṭṭugunnadi kānuga payyada mūsī yem̐ṭido
aṭṭĕ sedulusām̐si aṁdugorādā
suṭṭisuṭṭi lāsīni sudadi tā niṁduge
iṭṭĕ kaṁbamumām̐ṭu kiddaru nem̐garayyā

(||appa||)
yebuna sannalusesi nĕṁdugo yalamelmaṁga
sūbula śhrīveṁkaḍeśha sūḍarādā
yībaṭṭuna nannelidi viṁti gorinaṁduge
yem̐paga nāmaṁchamubai kiddaru nem̐garayyā