Appadi navvevu prahlaadavaradaa

అప్పటి నవ్వేవు ప్రహ్లాదవరదా
Language

(॥పల్లవి॥)
అప్పటి నవ్వేవు ప్రహ్లాదవరదా
అప్పసపు కాంతల ప్రహ్లాదవరదా

(॥అప్ప॥)
కన్నవిన్నసతులెల్లా కంకిసేసినా నొర్చితి
వన్నిటా శాంతుఁడవుప్రహ్లాదవరదా
న న్నొడఁబరచనేల నయగారిమాటల నీ
వన్నట్టే ఆయనుప్రహ్లాదవరదా

(॥అప్ప॥)
లాసుక యెంగిలి మోవులకు నోరు దెరచేవు
ఆసోదకాఁడవయ్య ప్రహ్లాదవరదా
రాసికెక్కి నాచెవిలో రహస్య మానతిచ్చేవు
ఆసుద్దు లెఱఁగనా ప్రహాలదవరదా

(॥అప్ప॥)
చెంది యహోబలమున శ్రీవేంకటాద్రిమీఁద
అంది పెండ్డాడితివి ప్రహాదవరదా
మందెమేళమున నిన్ను మచ్చికతోఁ గొసరితే
అందాల మెచ్చితివి ప్రహ్లాదవరదా

(||pallavi||)
appaḍi navvevu prahlādavaradā
appasabu kāṁtala prahlādavaradā

(||appa||)
kannavinnasadulĕllā kaṁkisesinā nŏrsidi
vanniḍā śhāṁtum̐ḍavuprahlādavaradā
na nnŏḍam̐barasanela nayagārimāḍala nī
vannaṭṭe āyanuprahlādavaradā

(||appa||)
lāsuga yĕṁgili movulagu noru dĕrasevu
āsodagām̐ḍavayya prahlādavaradā
rāsigĕkki nāsĕvilo rahasya mānadichchevu
āsuddu lĕṟam̐ganā prahāladavaradā

(||appa||)
sĕṁdi yahobalamuna śhrīveṁkaḍādrimīm̐da
aṁdi pĕṁḍḍāḍidivi prahādavaradā
maṁdĕmeḽamuna ninnu machchigadom̐ gŏsaride
aṁdāla mĕchchidivi prahlādavaradā