Appadi naage valadu namduvu neevu

అప్పటి నాకే వలతు నందువు నీవు
Language

(॥పల్లవి॥)
అప్పటి నాకే వలతు నందువు నీవు
చిప్పిల నావద్ద నేఁడే చెల్లె నీ ప్రతాపము

(॥అప్పటి॥)
జూటరివై యాకెమోము చూచి చూచి పలికేవు
యేఁటిమతకములౌతా నెవ్వఁ డెఱుఁగు
నాఁటకమే మోకాని నవ్వునవ్వే వేమన్నా
ఆఁటదాని నింతసేసే వౌ నీప్రతాపము

(॥అప్పటి॥)
అదె మాయింటికి నాకె నడిగడిగి వచ్చేవు
యెదుటి నీవెడమాయ లెవ్వఁ డెఱుఁగు
చదివి వచ్చితోకాని సరసాలే నెరుపేవు
సుదతులకే చూపేవు సొంపు నీప్రతాపము

(॥అప్పటి॥)
అకెతో నేకతమాడి అంతలో నన్నుఁ గూడితి
వీకడ నీతమకము లెవ్వఁ డెఱుఁగు
దాకొని శ్రీవేంకటేశ తలఁచుకొంటివోకాని
నీకతలు రతికెక్కె నిండె నీప్రతాపము

(||pallavi||)
appaḍi nāge valadu naṁduvu nīvu
sippila nāvadda nem̐ḍe sĕllĕ nī pradābamu

(||appaḍi||)
jūḍarivai yāgĕmomu sūsi sūsi paligevu
yem̐ṭimadagamulaudā nĕvvam̐ ḍĕṟum̐gu
nām̐ṭagame mogāni navvunavve vemannā
ām̐ṭadāni niṁtasese vau nīpradābamu

(||appaḍi||)
adĕ māyiṁṭigi nāgĕ naḍigaḍigi vachchevu
yĕduḍi nīvĕḍamāya lĕvvam̐ ḍĕṟum̐gu
sadivi vachchidogāni sarasāle nĕrubevu
sudadulage sūbevu sŏṁpu nīpradābamu

(||appaḍi||)
agĕdo negadamāḍi aṁtalo nannum̐ gūḍidi
vīgaḍa nīdamagamu lĕvvam̐ ḍĕṟum̐gu
dāgŏni śhrīveṁkaḍeśha talam̐sugŏṁṭivogāni
nīgadalu radigĕkkĕ niṁḍĕ nīpradābamu