అప్పటి నాతో మాఁటాడీ నదివో తాను
(॥పల్లవి॥)
అప్పటి నాతో మాఁటాడీ నదివో తాను
యిప్పుడు తనగుణాన కెనవత్తు నటవే
(॥అప్ప॥)
పలుమారు సొలసితి పైపైఁ దన్ను దూరితి
కలువల వేసితిఁ గాఁక చల్లితి
వలపు నన్నింతసేసె వాసులు పంతము రేఁచె
మలసి తనకు నేను మంచిదాననటవే
(॥అప్ప॥)
బొమ్మల జంకించితి పొదుగఁగాఁ బెనఁగితి
చిమ్మితి గోళ్ల గుంపించితి సారెకు
నెమ్మనము చలపట్టె నిక్కించె మందెమేళము
యిమ్ములఁ దనకు నేను హితురాలనటవే
(॥అప్ప॥)
చన్నుల నొత్తితి మోవి చవిగొంటిఁ దమితోడ
కన్నులనే మెచ్చితి కాఁగిలించితి
అన్నిటా శ్రీవేంకటేశుఁ డలమేల్ మంగను నేను
వున్నతి నన్నేలినాఁడు వుపకారినటవే
(||pallavi||)
appaḍi nādo mām̐ṭāḍī nadivo tānu
yippuḍu tanaguṇāna kĕnavattu naḍave
(||appa||)
palumāru sŏlasidi paibaim̐ dannu dūridi
kaluvala vesidim̐ gām̐ka sallidi
valabu nanniṁtasesĕ vāsulu paṁtamu rem̐sĕ
malasi tanagu nenu maṁchidānanaḍave
(||appa||)
bŏmmala jaṁkiṁchidi pŏdugam̐gām̐ bĕnam̐gidi
simmidi goḽla guṁpiṁchidi sārĕgu
nĕmmanamu salabaṭṭĕ nikkiṁchĕ maṁdĕmeḽamu
yimmulam̐ danagu nenu hidurālanaḍave
(||appa||)
sannula nŏttidi movi savigŏṁṭim̐ damidoḍa
kannulane mĕchchidi kām̐giliṁchidi
anniḍā śhrīveṁkaḍeśhum̐ ḍalamel maṁganu nenu
vunnadi nannelinām̐ḍu vubagārinaḍave