అప్పటి కిప్పుడు మాట లవియేల తడవేవే
(॥పల్లవి॥)
అప్పటి కిప్పుడు మాట లవియేల తడవేవే
కప్పురము దిన్నమీఁద కాఁకలుండునా
(॥అప్ప॥)
తెగువలేమిటికే తేనెగారే మోవిమీఁద
నగవే నింతురుగాక నయముగాను
చిగురుఁ గాలమునాఁడు చేరి వొగరైవుండు
మిగులఁ బండిననాఁడు మించి తీపై వుండును
(॥అప్ప॥)
సూడఁబాడు లేఁటికే చుట్టిరికమైనచోట
వీడుదోడులై వుండుటే వేడుకగాక
యేడనైనాఁ బట్టపగ లెండలు గాయుచునుండ
ఆడ వెన్నెలగాయు నది చల్లనౌను
(॥అప్ప॥)
శ్రీ వేంకటేశుఁడు గూడె సిగ్గులు పైపైనేలే
వేవేలువిధాలఁ జెల్లు వేడుకలెల్లా
భావించఁగ ననలు పసురువేయుచునుండు
పూవులైతే వాసనలు బుగులుకొనుండును
(||pallavi||)
appaḍi kippuḍu māḍa laviyela taḍaveve
kappuramu dinnamīm̐da kām̐kaluṁḍunā
(||appa||)
tĕguvalemiḍige tenĕgāre movimīm̐da
nagave niṁturugāga nayamugānu
sigurum̐ gālamunām̐ḍu seri vŏgaraivuṁḍu
migulam̐ baṁḍinanām̐ḍu miṁchi tībai vuṁḍunu
(||appa||)
sūḍam̐bāḍu lem̐ṭige suṭṭirigamainasoḍa
vīḍudoḍulai vuṁḍuḍe veḍugagāga
yeḍanainām̐ baṭṭabaga lĕṁḍalu gāyusunuṁḍa
āḍa vĕnnĕlagāyu nadi sallanaunu
(||appa||)
śhrī veṁkaḍeśhum̐ḍu gūḍĕ siggulu paibainele
veveluvidhālam̐ jĕllu veḍugalĕllā
bhāviṁcham̐ga nanalu pasuruveyusunuṁḍu
pūvulaide vāsanalu bugulugŏnuṁḍunu