అప్పటి కప్పుడే కాక అంతయేఁటికి
(॥పల్లవి॥)
అప్పటి కప్పుడే కాక అంతయేఁటికి
యెప్పుడూ మనకుఁబోదు ఇందవయ్య విడెము
(॥అప్ప॥)
తక్కి మాఁటునన్నున్నంతతడవు నిను దూరితి
నిక్కి చూడఁబోతేను నీవే నేను
కక్కసించ నిఁక నిన్ను కడు నానవెట్ట కిఁక
యిక్కువలు గరఁగేను ఇందవయ్య విడెము
(॥అప్ప॥)
గుట్టుతో నూరకుండఁగా గుణము వెరవులాయ
నెల్టుకొని మాటాడితే నీవే నేను
పెట్టను రట్ల పెనఁగకుమిఁక నీవు
ఇట్టే నీమాఁటలు వింటి నిందవయ్య విడెము
(॥అప్ప॥)
రయ దూరకున్నందు కటు నిట్టు బిగిసితి
నారిచి పొందుసేసితే నీవే నేను
కోరి శ్రీవేంకటేశుఁడ కూడితి మిద్దరమును
యీరీతిఁ బాయకుందము ఇందవయ్య విడెము
(||pallavi||)
appaḍi kappuḍe kāga aṁtayem̐ṭigi
yĕppuḍū managum̐bodu iṁdavayya viḍĕmu
(||appa||)
takki mām̐ṭunannunnaṁtadaḍavu ninu dūridi
nikki sūḍam̐bodenu nīve nenu
kakkasiṁcha nim̐ka ninnu kaḍu nānavĕṭṭa kim̐ka
yikkuvalu garam̐genu iṁdavayya viḍĕmu
(||appa||)
guṭṭudo nūraguṁḍam̐gā guṇamu vĕravulāya
nĕlṭugŏni māḍāḍide nīve nenu
pĕṭṭanu raṭla pĕnam̐gagumim̐ka nīvu
iṭṭe nīmām̐ṭalu viṁṭi niṁdavayya viḍĕmu
(||appa||)
raya dūragunnaṁdu kaḍu niṭṭu bigisidi
nārisi pŏṁduseside nīve nenu
kori śhrīveṁkaḍeśhum̐ḍa kūḍidi middaramunu
yīrīdim̐ bāyaguṁdamu iṁdavayya viḍĕmu