Appadi balimi sese rayyo meeru

అప్పటి బలిమి సేసే రయ్యో మీరు
Language

(॥పల్లవి॥)
అప్పటి బలిమి సేసే రయ్యో మీరు
వుప్పు గప్పురమువలె వుండకుండీనా

(॥అప్ప॥)
పై తరవు లింతయేల పట్టకురే చెలులాల
ఆతఁడేడ నేనేఁడ అయ్యో మీరు
రాతి రింటిపొందులెల్ల రాతిరికే ఆయఁబోయ
యీతల వేగెఁ బొద్దు ఇప్పుడుండీనా

(॥అప్ప॥)
చందమామగుటుకలు సారెసారెఁ జెప్పఁబోతే
అందునిందు నెడతాఁకే రయ్యో మీరు
నిందవచ్చెఁ దనకుఁగా నిండెను రేకలు మేన
సందేహమెల్లఁ బాసె సరివచ్చినా

(॥అప్ప॥)
చిత్తమునెంజరి దీరి శ్రీ వేంకటేశు నిన్ను
హత్తించితిరి మేలు అయ్యో మీరు
పొత్తులచుట్టాలు మీరు భోగములు మాకు నబ్బె
కొత్తలాయి నవ్వులు కొఱతయ్యీనా

(||pallavi||)
appaḍi balimi sese rayyo mīru
vuppu gappuramuvalĕ vuṁḍaguṁḍīnā

(||appa||)
pai taravu liṁtayela paṭṭagure sĕlulāla
ādam̐ḍeḍa nenem̐ḍa ayyo mīru
rādi riṁṭibŏṁdulĕlla rādirige āyam̐boya
yīdala vegĕm̐ bŏddu ippuḍuṁḍīnā

(||appa||)
saṁdamāmaguḍugalu sārĕsārĕm̐ jĕppam̐bode
aṁduniṁdu nĕḍadām̐ke rayyo mīru
niṁdavachchĕm̐ danagum̐gā niṁḍĕnu regalu mena
saṁdehamĕllam̐ bāsĕ sarivachchinā

(||appa||)
sittamunĕṁjari dīri śhrī veṁkaḍeśhu ninnu
hattiṁchidiri melu ayyo mīru
pŏttulasuṭṭālu mīru bhogamulu māgu nabbĕ
kŏttalāyi navvulu kŏṟadayyīnā