Appadanumdi veragayyee mimmiddarim joosi

అప్పటనుండి వెరగయ్యీ మిమ్మిద్దరిఁ జూచి
Language

(॥పల్లవి॥)
అప్పటనుండి వెరగయ్యీ మిమ్మిద్దరిఁ జూచి
వొప్పుగా సంతోసాల నోలలాడేమయ్యా

(॥అప్ప॥)
పెక్కుసింగారాలతోడి పెండ్లికూఁతురు నీకు
యెక్కడఁ గలిగె నానతియ్యవయ్యా
మిక్కుటపు చేఁతల మేనమరఁదలు నేఁడు
నెక్కొని సరసమాడ నీ భాగ్యమాయనయ్యా

(॥అప్ప॥)
రచ్చకెక్కినటువంటి రాణివాసము నీకు
మెచ్చుగా నెందుండివచ్చె మేలు మేలయ్యా
విచ్చనవిడియైనట్టి వేడుక నగళ్ళవారు
అచ్చమై నీసేవసేయ నందమౌనయ్యా

(॥అప్ప॥)
కాఁపురము నేరిచిన కలికిగేస్తురాలు
దాఁపురమై కాచుకుండెఁ దగవౌనయ్యా
యేపున నన్నేలితివి యిట్టె శ్రీవేంకటేశ
ఆపే నొకతె గలిగె నమరు నీకయ్యా

(||pallavi||)
appaḍanuṁḍi vĕragayyī mimmiddarim̐ jūsi
vŏppugā saṁtosāla nolalāḍemayyā

(||appa||)
pĕkkusiṁgārāladoḍi pĕṁḍligūm̐turu nīgu
yĕkkaḍam̐ galigĕ nānadiyyavayyā
mikkuḍabu sem̐tala menamaram̐dalu nem̐ḍu
nĕkkŏni sarasamāḍa nī bhāgyamāyanayyā

(||appa||)
rachchagĕkkinaḍuvaṁṭi rāṇivāsamu nīgu
mĕchchugā nĕṁduṁḍivachchĕ melu melayyā
vichchanaviḍiyainaṭṭi veḍuga nagaḽḽavāru
achchamai nīsevaseya naṁdamaunayyā

(||appa||)
kām̐puramu nerisina kaligigesturālu
dām̐puramai kāsuguṁḍĕm̐ dagavaunayyā
yebuna nannelidivi yiṭṭĕ śhrīveṁkaḍeśha
ābe nŏgadĕ galigĕ namaru nīgayyā