అప్పటనుండి నీవు ఆపెతోనే మాటాడేవు
(॥పల్లవి॥)
అప్పటనుండి నీవు ఆపెతోనే మాటాడేవు
చొప్పుగ నీచరితలు చూచి వెరగయ్యీని
(॥అప॥)
చెలికతై నీకుఁ జేసె సేనసేన విన్నపాలు
వెలయ నీచెవులార వింటివా నీవు
పిలువ నంపిన నీవలపులదేవులఁ
దలఁచుకొంటివా లెస్స తాలిమితోడుతను
(॥అప ॥)
ఇక్కువ నాకెయిచ్చిన యెఱ్ఱనినిమ్మపండులు
అక్కర తోడుత నీ వందుకొంటివా
చక్కఁగ నాపెయేలికసానిపరిణామము
అక్కజముగా సారెకు నడిగితివా
(॥అప॥)
దొరకొని నీకుఁ జేసేదూతికలవినయాలు
సిరులఁ గైకొని యట్టే సేసితివా
పరగ నలమేలె మంగపతివి శ్రీవేంకటేశ
ఆరపి నన్నే లితి వల్లాపెనుఁ గూడితివా
(||pallavi||)
appaḍanuṁḍi nīvu ābĕdone māḍāḍevu
sŏppuga nīsaridalu sūsi vĕragayyīni
(||aba||)
sĕligadai nīgum̐ jesĕ senasena vinnabālu
vĕlaya nīsĕvulāra viṁṭivā nīvu
piluva naṁpina nīvalabuladevulam̐
dalam̐sugŏṁṭivā lĕssa tālimidoḍudanu
(||aba ||)
ikkuva nāgĕyichchina yĕṭraninimmabaṁḍulu
akkara toḍuda nī vaṁdugŏṁṭivā
sakkam̐ga nābĕyeligasānibariṇāmamu
akkajamugā sārĕgu naḍigidivā
(||aba||)
dŏragŏni nīgum̐ jesedūdigalavinayālu
sirulam̐ gaigŏni yaṭṭe sesidivā
paraga nalamelĕ maṁgabadivi śhrīveṁkaḍeśha
ārabi nanne lidi vallābĕnum̐ gūḍidivā