అప్పటనుండి నవ్వీ నాతఁడు నీతో
(॥పల్లవి॥)
అప్పటనుండి నవ్వీ నాతఁడు నీతో
యిప్పుడు సిగ్గు లివేలే యియ్యకొంటగాక
(॥అప్ప॥)
చలపాదితనమేల సరసమాడేటి వేళ
చెలరేఁగి సొలపుల చేఁతలేకాక
బలిమి బిగియనేల పట్టిపెనఁగేటివేళ
చెలిమి చూపి ప్రియము చెప్పటే కాక
(॥అప్ప॥)
పంతము లాడఁగనేల పానుపుపైనున్న వేళ
సంతోసాన వలపులు చల్లుటగాక
వింతలు సేయఁగనేల విచ్చనవిడైన వేళ
చెంతనే వలసినట్టు చెనకుటగాక
(॥అప్ప॥)
ముంచి మాఁట లాడనేల మోవి చవిగొనేవేళ
కంచపు పొత్తుల మేలు గైకొంటగాక
యెంచఁగ శ్రీవేంకటేశుఁ డింతలోనే నినుఁగూడె
పొంచి పొంచి వేడుకల భోగించుటగాక
(||pallavi||)
appaḍanuṁḍi navvī nādam̐ḍu nīdo
yippuḍu siggu livele yiyyagŏṁṭagāga
(||appa||)
salabādidanamela sarasamāḍeḍi veḽa
sĕlarem̐gi sŏlabula sem̐talegāga
balimi bigiyanela paṭṭibĕnam̐geḍiveḽa
sĕlimi sūbi priyamu sĕppaḍe kāga
(||appa||)
paṁtamu lāḍam̐ganela pānububainunna veḽa
saṁtosāna valabulu salluḍagāga
viṁtalu seyam̐ganela vichchanaviḍaina veḽa
sĕṁtane valasinaṭṭu sĕnaguḍagāga
(||appa||)
muṁchi mām̐ṭa lāḍanela movi savigŏneveḽa
kaṁchabu pŏttula melu gaigŏṁṭagāga
yĕṁcham̐ga śhrīveṁkaḍeśhum̐ ḍiṁtalone ninum̐gūḍĕ
pŏṁchi pŏṁchi veḍugala bhogiṁchuḍagāga