అనుమానించఁగనేలా అవిగో నీచేఁతలు
(॥పల్లవి॥)
అనుమానించఁగనేలా అవిగో నీచేఁతలు
దిన దిన కొత్తలెల్లా దిష్టమాయ మాకును
(॥అను॥)
కొసరి యెవ్వతె నీతో కొంగువట్టి పెనఁగెనో
పసపల్లా నంటె నదె పచ్చడానను
యెసగి చెక్కులువట్టి యెంత వేఁడుకొనెనో
సుసరాన గోరికొన సోఁకులు చూపట్టెను
(॥అను॥)
కమ్మటి నాపె యేరీతి కాఁగిట బిగించెనో
కుమ్మెలువోయి గుబ్బలగురు లున్నవి
యిమ్మల నీవొడివట్టి యెంత వొడఁబరచెనో
నెమ్మదిఁ గానుకిచ్చిన నిమ్మపండ్లు గంటిని
(॥అను॥)
పాదాలకు మొక్కి యెట్టు పానుపుపైఁ గూడెనో
పోదితో మైతావి నీపైఁ బొలుపొందెను
పాదుగ నలమేల్మంగపతివి శ్రీవేంకటేశ
యీదెస నన్నేలితివి యీకె నీకుఁ జట్టము
(||pallavi||)
anumāniṁcham̐ganelā avigo nīsem̐talu
dina dina kŏttalĕllā diṣhṭamāya māgunu
(||anu||)
kŏsari yĕvvadĕ nīdo kŏṁguvaṭṭi pĕnam̐gĕno
pasaballā naṁṭĕ nadĕ pachchaḍānanu
yĕsagi sĕkkuluvaṭṭi yĕṁta vem̐ḍugŏnĕno
susarāna gorigŏna som̐kulu sūbaṭṭĕnu
(||anu||)
kammaḍi nābĕ yerīdi kām̐giḍa bigiṁchĕno
kummĕluvoyi gubbalaguru lunnavi
yimmala nīvŏḍivaṭṭi yĕṁta vŏḍam̐barasĕno
nĕmmadim̐ gānugichchina nimmabaṁḍlu gaṁṭini
(||anu||)
pādālagu mŏkki yĕṭṭu pānububaim̐ gūḍĕno
podido maidāvi nībaim̐ bŏlubŏṁdĕnu
pāduga nalamelmaṁgabadivi śhrīveṁkaḍeśha
yīdĕsa nannelidivi yīgĕ nīgum̐ jaṭṭamu