(॥పల్లవి॥)
అనుమానానకు నోపనపుడు నేనూ
తనివోని నీ తలఁపు తలపోసుకొమ్మా
(॥అను॥)
పిలిచేవు సారెసారెఁ బెదపెద యెలుఁగున
నెలవుల నీమాఁట నిక్కమావోయి
వెలయ నన్నే యవునో వేరొకతెనే నంటానో
తెలియఁ జూతువుగాని దిష్ట మిటురమ్మా
(॥అను॥)
చూచేవు దవ్వులను సూటిఁబడ్డచూపులను
యేచి నే నమ్ముదునా యిదైనా నోయి
కాచి యిదేపనో నీకు కాక తాళనాయమో
ఆచెంతే విచారింతు పండ కిటురమ్మా
(॥అను॥)
కూడితివి కాఁగిటను కూరిమి చేతులు చాఁచి
జాడతో నీకిఁక నేనే సతమా వోయి
వేడుక శ్రీవేంకటేశ వింతలాయ నీచేఁత
జాడతో నీమోవితేనెచవి యింకా నిమ్మా
(||pallavi||)
anumānānagu nobanabuḍu nenū
tanivoni nī talam̐pu talabosugŏmmā
(||anu||)
pilisevu sārĕsārĕm̐ bĕdabĕda yĕlum̐guna
nĕlavula nīmām̐ṭa nikkamāvoyi
vĕlaya nanne yavuno verŏgadĕne naṁṭāno
tĕliyam̐ jūduvugāni diṣhṭa miḍurammā
(||anu||)
sūsevu davvulanu sūḍim̐baḍḍasūbulanu
yesi ne nammudunā yidainā noyi
kāsi yidebano nīgu kāga tāḽanāyamo
āsĕṁte visāriṁtu paṁḍa kiḍurammā
(||anu||)
kūḍidivi kām̐giḍanu kūrimi sedulu sām̐si
jāḍado nīgim̐ka nene sadamā voyi
veḍuga śhrīveṁkaḍeśha viṁtalāya nīsem̐ta
jāḍado nīmovidenĕsavi yiṁkā nimmā