Anniyu neeyamde amarenada

అన్నియు నీయందే అమరెనట
Language

(॥పల్లవి॥)
అన్నియు నీయందే అమరెనట
కన్నియ ఇందుకు మారుగత చెప్పవే

(॥అన్ని॥)
కలువలు వికసింపఁ గమలములై తోఁచె
గలికి విన్నిట నీకత చెప్పవే
అలులంటా బడిఁబోతే అన్నయు నీలములాయ
కలగాదు ఇది యొక్కకత చెప్పవే

(॥అన్ని॥)
జక్కవలు గండుమీది సరిఁ బైడికుండలాయ
గక్కన విచారించి కత చెప్పవే
మక్కువతో బులినాలు మదనచక్రములాయ
కక్కసము మాని నాకీకత చెప్పవే

(॥అన్ని॥)
ఆకసము చూడజూడ నదె సింహమాయ నట
కాకుగాదు ది యొక్కకత చెప్పవే
యీకడను శ్రీవేంకటేశుఁడను నే నిన్ను
పై కొన్న దిది యొక్కకత చెప్పవే

(||pallavi||)
anniyu nīyaṁde amarĕnaḍa
kanniya iṁdugu mārugada sĕppave

(||anni||)
kaluvalu vigasiṁpam̐ gamalamulai tom̐sĕ
galigi vinniḍa nīgada sĕppave
alulaṁṭā baḍim̐bode annayu nīlamulāya
kalagādu idi yŏkkagada sĕppave

(||anni||)
jakkavalu gaṁḍumīdi sarim̐ baiḍiguṁḍalāya
gakkana visāriṁchi kada sĕppave
makkuvado bulinālu madanasakramulāya
kakkasamu māni nāgīgada sĕppave

(||anni||)
āgasamu sūḍajūḍa nadĕ siṁhamāya naḍa
kāgugādu di yŏkkagada sĕppave
yīgaḍanu śhrīveṁkaḍeśhum̐ḍanu ne ninnu
pai kŏnna didi yŏkkagada sĕppave