అన్నియు నే నెఱుఁగుదు నందుకేమి
(॥పల్లవి॥)
అన్నియు నే నెఱుఁగుదు నందుకేమి
సన్న సేసీ యాకె నిన్నుఁ జక్కఁ జూడరాదా
(॥అన్ని॥)
కప్పరమిచ్చి యాకె గైకొనఁగ రాదా
అప్పుడే నా మోము చూచె వందుకేమి
చెప్పియంపినది యేమో చెలియి మాటలు విను
యెప్పుడు నీవద్ద నుండు దెందు వొయ్యే నేను
(॥అన్ని॥)
మొక్కులు మొక్కీ అకెముచ్చట దేరుచరాదా
యెక్కుడు నీతో నవ్వే విందుకేమి
దిక్కులనే కోపగించి తిట్టీ నిన్నదిగో
అక్కడి దీవెనఁ బొందు అలిగేనా నేను
(॥అన్ని॥)
కాఁగిలించి ఆకె నిట్టె కరఁగించరాదా
ఆఁగి నన్నుఁ గూడితిని అందుకేమి
మూఁగుచుఁ గామలాపురమునఁ గంచిరాయఁడనై
చేఁగదేర నేలితివి శ్రీవేంకటేశుఁడా
(||pallavi||)
anniyu ne nĕṟum̐gudu naṁdugemi
sanna sesī yāgĕ ninnum̐ jakkam̐ jūḍarādā
(||anni||)
kapparamichchi yāgĕ gaigŏnam̐ga rādā
appuḍe nā momu sūsĕ vaṁdugemi
sĕppiyaṁpinadi yemo sĕliyi māḍalu vinu
yĕppuḍu nīvadda nuṁḍu dĕṁdu vŏyye nenu
(||anni||)
mŏkkulu mŏkkī agĕmuchchaḍa derusarādā
yĕkkuḍu nīdo navve viṁdugemi
dikkulane kobagiṁchi tiṭṭī ninnadigo
akkaḍi dīvĕnam̐ bŏṁdu aligenā nenu
(||anni||)
kām̐giliṁchi āgĕ niṭṭĕ karam̐giṁcharādā
ām̐gi nannum̐ gūḍidini aṁdugemi
mūm̐gusum̐ gāmalāburamunam̐ gaṁchirāyam̐ḍanai
sem̐gadera nelidivi śhrīveṁkaḍeśhum̐ḍā