Anniyu marumdeṟumgu naune taanu

అన్నియు మరుఁడెఱుఁగు నౌనే తాను
Language

(॥పల్లవి॥)
అన్నియు మరుఁడెఱుఁగు నౌనే తాను
సన్నసేసి కాననీని జాణఁడే తాను

(॥అన్ని॥)
ఆసలాసలఁబెట్టి అలయించుటాఁగాక
వేసాలకు నున్సురినీ వేళమే తాను
బాసవేసి యింతలెనె పాడి దప్పుటాఁగాక
దోసాన కొడిగట్టీని దొడ్డఁవాడే తాను

(॥అన్ని॥)
పచ్చిమాఁటలాడి నన్ను భ్రమయించుటాఁగాక
నచ్చుకోట్టికొంతగొంత నవ్వీనే తాను
కుచ్చి నన్ను దగ్గరుచు గోరు దాఁకించుటాఁగాక
పెచ్చుగాఁ బెట్టకుమంటాఁ బెనఁగీనే తాను

(॥అన్ని॥)
గక్కనఁ గాఁగిటిలోనేఁ గరఁగించుటాఁగాక
ముక్కుమీఁద నొంటివేలు మోపీనే తాను
పక్కన రతుల సరి పంతమాడుటాఁగాక
యెక్కుడైన శ్రీవేంకటేశుఁడే తాను

(||pallavi||)
anniyu marum̐ḍĕṟum̐gu naune tānu
sannasesi kānanīni jāṇam̐ḍe tānu

(||anni||)
āsalāsalam̐bĕṭṭi alayiṁchuḍām̐gāga
vesālagu nunsurinī veḽame tānu
bāsavesi yiṁtalĕnĕ pāḍi dappuḍām̐gāga
dosāna kŏḍigaṭṭīni dŏḍḍam̐vāḍe tānu

(||anni||)
pachchimām̐ṭalāḍi nannu bhramayiṁchuḍām̐gāga
nachchugoṭṭigŏṁtagŏṁta navvīne tānu
kuchchi nannu daggarusu goru dām̐kiṁchuḍām̐gāga
pĕchchugām̐ bĕṭṭagumaṁṭām̐ bĕnam̐gīne tānu

(||anni||)
gakkanam̐ gām̐giḍilonem̐ garam̐giṁchuḍām̐gāga
mukkumīm̐da nŏṁṭivelu mobīne tānu
pakkana radula sari paṁtamāḍuḍām̐gāga
yĕkkuḍaina śhrīveṁkaḍeśhum̐ḍe tānu