అన్నినాయ నిఁకనేల ఆ సుద్దులు
(॥పల్లవి॥)
అన్నినాయ నిఁకనేల ఆ సుద్దులు
మన్నించితి వప్పుడే నీమాట వింటినయ్యా
(॥అన్ని॥)
యింటికి నీవు వచ్చి యీతవరివై యుండఁగా
నంటు సేసి నీతోను నవ్వవలెఁగా
జంటనుండి వాపులు సారె నీవు చెప్పఁగాను
అంటిముట్టి సరసములాడవలెఁగా
(॥అన్ని॥)
కదిసి చుట్టమవై కాఁపురాలు సేయరాఁగా
యెదురుకొని విడెము లియ్యవలెఁగా
కొదలేక నీవు నాకొంగువట్టి పెనఁగఁగా
యిదె నీతో మొగమోట నియ్యకొనవలెఁగా
(॥అన్ని॥)
చేరిచేరి నీవు నాపై సేసలు చల్లఁగాను
కూరిమితోఁగాఁగిలించుకొనవలెఁగా
యీరీతి శ్రీవేంకటేశ యేలితివి నన్ను నేఁడు
కోరికె లీడేరె నిన్నుఁ గొనియాడవలెఁగా
(||pallavi||)
annināya nim̐kanela ā suddulu
manniṁchidi vappuḍe nīmāḍa viṁṭinayyā
(||anni||)
yiṁṭigi nīvu vachchi yīdavarivai yuṁḍam̐gā
naṁṭu sesi nīdonu navvavalĕm̐gā
jaṁṭanuṁḍi vābulu sārĕ nīvu sĕppam̐gānu
aṁṭimuṭṭi sarasamulāḍavalĕm̐gā
(||anni||)
kadisi suṭṭamavai kām̐purālu seyarām̐gā
yĕdurugŏni viḍĕmu liyyavalĕm̐gā
kŏdalega nīvu nāgŏṁguvaṭṭi pĕnam̐gam̐gā
yidĕ nīdo mŏgamoḍa niyyagŏnavalĕm̐gā
(||anni||)
seriseri nīvu nābai sesalu sallam̐gānu
kūrimidom̐gām̐giliṁchugŏnavalĕm̐gā
yīrīdi śhrīveṁkaḍeśha yelidivi nannu nem̐ḍu
korigĕ līḍerĕ ninnum̐ gŏniyāḍavalĕm̐gā