Annidaanu kadujooda vauduve neevu

అన్నిటాను కడుజూట వౌదువే నీవు
Language

(॥పల్లవి॥)
అన్నిటాను కడుజూట వౌదువే నీవు
సన్న లాతఁడు చేసితే జంకించేవు నీవు

(॥అన్ని॥)
కాటుకకన్నులఁ జూచి కడుసొలసిసొలసి
మాటాడనేతువౌనే మగనితోను
నీటున నప్పటి నుండి నిన్నాతఁడు వేఁడుకోఁగా
పాటించినీ వెంతవొడఁబరచేవేకమ్మటి

(॥అన్ని॥)
జవ్వనపుసింగారముసారెసారెఁ గురియుచు
నవ్వున నవ్వనేరుతువే నాథునితోను
పువ్వుల నాతఁడు నిన్నుపూఁచిపూఁచివేయఁగాను
మువ్వంకానొడ్డించుకొంటా మొక్కేవేమే నీవు

(॥అన్ని॥)
వెలలేనివలపులు వేమారుఁజల్లిరతులఁ
గలయనేర్తువే శ్రీవేంకటేశుతోను
చెలరేఁగి సేస లాతఁడువెట్టంగా
నిలిచియిచ్చకమెంతనెరపేవేనీవు

(||pallavi||)
anniḍānu kaḍujūḍa vauduve nīvu
sanna lādam̐ḍu seside jaṁkiṁchevu nīvu

(||anni||)
kāḍugagannulam̐ jūsi kaḍusŏlasisŏlasi
māḍāḍaneduvaune maganidonu
nīḍuna nappaḍi nuṁḍi ninnādam̐ḍu vem̐ḍugom̐gā
pāḍiṁchinī vĕṁtavŏḍam̐barasevegammaḍi

(||anni||)
javvanabusiṁgāramusārĕsārĕm̐ guriyusu
navvuna navvaneruduve nāthunidonu
puvvula nādam̐ḍu ninnubūm̐sibūm̐siveyam̐gānu
muvvaṁkānŏḍḍiṁchugŏṁṭā mŏkkeveme nīvu

(||anni||)
vĕlalenivalabulu vemārum̐jalliradulam̐
galayanerduve śhrīveṁkaḍeśhudonu
sĕlarem̐gi sesa lādam̐ḍuvĕṭṭaṁgā
nilisiyichchagamĕṁtanĕrabevenīvu