Annidaanu doravaide naidivi gaaga

అన్నిటాను దొరవైతే నైతివి గాక
Language

(॥పల్లవి॥)
అన్నిటాను దొరవైతే నైతివి గాక
నిన్ను నిట్టె మెప్పించనేరనా నేను

(॥అన్ని॥)
పడఁతికి మగనితో బలిమి వద్దనికాక
వొడివట్టి నిన్నుఁ దియ్యనోపనా నేను
కడలేని నిబ్బరానఁ గాలుదాఁకీననికాక
వుడివోనిసరసాన కోపనా నేను

(॥అన్ని॥)
చెల్లఁబో నీలోనివే సిగ్గువడేవనికాక
వొల్లనే నీతో మాటాడనోపనా నేను
పల్లదపురతులను భ్రమసేవంటాఁగాక నీ-
వుల్ల మిట్టే కరఁగించనోపనానేను

(॥అన్ని॥)
పుక్కట నీపెదవి కెంపులురేఁగీనవి కాక
వుక్కున నీమోవి యాననోపనా నేను
నిక్కి శ్రీవేంకటేశుఁడ నే నలమేలుమంగను
వొక్కట నేలితి విందు కోపనా నేను

(||pallavi||)
anniḍānu dŏravaide naidivi gāga
ninnu niṭṭĕ mĕppiṁchaneranā nenu

(||anni||)
paḍam̐tigi maganido balimi vaddanigāga
vŏḍivaṭṭi ninnum̐ diyyanobanā nenu
kaḍaleni nibbarānam̐ gāludām̐kīnanigāga
vuḍivonisarasāna kobanā nenu

(||anni||)
sĕllam̐bo nīlonive sigguvaḍevanigāga
vŏllane nīdo māḍāḍanobanā nenu
palladaburadulanu bhramasevaṁṭām̐gāga nī-
vulla miṭṭe karam̐giṁchanobanānenu

(||anni||)
pukkaḍa nībĕdavi kĕṁpulurem̐gīnavi kāga
vukkuna nīmovi yānanobanā nenu
nikki śhrīveṁkaḍeśhum̐ḍa ne nalamelumaṁganu
vŏkkaḍa nelidi viṁdu kobanā nenu