అన్నిటా నెరజాణఁ డాతఁడే యెరుఁగును
(॥పల్లవి॥)
అన్నిటా నెరజాణఁ డాతఁడే యెరుఁగును
విన్నపములెల్లాఁ జేసి వేడుకఁ బొగడరే
(॥అన్ని॥)
ఆసలు రేఁచినవాఁడు అండకు రాకుండునా
సేసలు వేట్టివాఁడు చెనకఁగ మానీనా
వాసులెక్కించినవాఁడు వన్నెకెక్క మన్నించఁడా
గోసనాసఁ బతినేమీఁ గొసరకురే
(॥అన్ని॥)
తమి వుట్టించినవాఁడు దయ నాపైఁదలఁచఁడా
మమత లెంచినవాఁడు మరుగక మరచీనా
నెమకి వచ్చినవాఁడు నేఁడు నన్నుఁ గైకొనఁడా
సముకాన నాతని జరయకురే
(॥అన్ని॥)
చెక్కులు నొక్కినవాఁడు సిగ్గులు దేరుచఁడా
మొక్కకు లోనైనవాఁడు మునుకొని మెచ్చఁడా
ఇక్కడ శ్రీవేంకటేశుఁ డింతలోనె నన్నుఁ గూడె
తక్కినచేఁత లిఁకఁ దడవకురే
(||pallavi||)
anniḍā nĕrajāṇam̐ ḍādam̐ḍe yĕrum̐gunu
vinnabamulĕllām̐ jesi veḍugam̐ bŏgaḍare
(||anni||)
āsalu rem̐sinavām̐ḍu aṁḍagu rāguṁḍunā
sesalu veṭṭivām̐ḍu sĕnagam̐ga mānīnā
vāsulĕkkiṁchinavām̐ḍu vannĕgĕkka manniṁcham̐ḍā
gosanāsam̐ badinemīm̐ gŏsaragure
(||anni||)
tami vuṭṭiṁchinavām̐ḍu daya nābaim̐dalam̐sam̐ḍā
mamada lĕṁchinavām̐ḍu marugaga marasīnā
nĕmagi vachchinavām̐ḍu nem̐ḍu nannum̐ gaigŏnam̐ḍā
samugāna nādani jarayagure
(||anni||)
sĕkkulu nŏkkinavām̐ḍu siggulu derusam̐ḍā
mŏkkagu lonainavām̐ḍu munugŏni mĕchcham̐ḍā
ikkaḍa śhrīveṁkaḍeśhum̐ ḍiṁtalonĕ nannum̐ gūḍĕ
takkinasem̐ta lim̐kam̐ daḍavagure