అన్నిటా జాణవు నీయంతదాననా నేను
(॥పల్లవి॥)
అన్నిటా జాణవు నీయంతదాననా నేను
యిన్నేసి నేరుపుల నన్నెంత వొరసేవు
(॥అన్ని॥)
ప్రేమతో నీవు నవ్వితే ప్రియమున నుందుఁగాని
యేమిటికౌతా నే నెఱఁగను
మోము దప్పకచూచితే ముంచి యాసగింతుఁగాని
కోమలమైన నీలొగుట్టు నేఁ దెలియను
(॥అన్ని॥)
మాటలు నీవాడితేను మతిఁ గరఁగుదుఁగాని
తేటలనీమర్మములు తెలియ నేను
చొటిచ్చి లాలించితేను చొక్కుచుఁ గూచుండుఁగాని
జూటరినీమరఁగులు సోదించ నేను
(॥అన్ని॥)
చెనకి కాఁగిలించితే వినయాన నుందుఁగాని
తనివోనినీతమి దలఁచ నేను
మనసిచ్చి యలమేలుమంగను శ్రీవేంకటేశ
నను నేలితివి యింకఁ బెనఁగ నేను
(||pallavi||)
anniḍā jāṇavu nīyaṁtadānanā nenu
yinnesi nerubula nannĕṁta vŏrasevu
(||anni||)
premado nīvu navvide priyamuna nuṁdum̐gāni
yemiḍigaudā ne nĕṟam̐ganu
momu dappagasūside muṁchi yāsagiṁtum̐gāni
komalamaina nīlŏguṭṭu nem̐ dĕliyanu
(||anni||)
māḍalu nīvāḍidenu madim̐ garam̐gudum̐gāni
teḍalanīmarmamulu tĕliya nenu
sŏḍichchi lāliṁchidenu sŏkkusum̐ gūsuṁḍum̐gāni
jūḍarinīmaram̐gulu sodiṁcha nenu
(||anni||)
sĕnagi kām̐giliṁchide vinayāna nuṁdum̐gāni
tanivoninīdami dalam̐sa nenu
manasichchi yalamelumaṁganu śhrīveṁkaḍeśha
nanu nelidivi yiṁkam̐ bĕnam̐ga nenu