Annidaa jaanamdainaamdu aalanu nenu

అన్నిటా జాణఁడైనాఁడు ఆలను నేను
Language

(॥పల్లవి॥)
అన్నిటా జాణఁడైనాఁడు ఆలను నేను
పన్ని తన చిత్తము పట్టనెటు నేర్తునే

(॥అన్ని॥)
యిచ్చకమాడఁగవలె ఇంతులకుఁ బతితోను
పచ్చిగా నవ్వఁగవలె పైకొనవలె
మచ్చరించరాదు మరి మంకులు చూపఁగరాదు
నిచ్చఁదనపొందుసేయ నేనెట్టు నేర్తునే

(॥అన్ని॥)
వూడిగము సేయవలె వొద్దికతో విభునికి
వేడుక సేయఁగవలె విడె మీవలె
పాడిపంతా లెంచరాదు బలిమిఁ దోయఁగరాదు
జాడమీరి తను నెట్టు జరయఁగనేర్తునే

(॥అన్ని॥)
చెనకఁగవలె తానె శ్రీవేంకటేశుఁడు రతిఁ
బెనఁగవలె కాఁగిట బెరయవలె
గునియఁగరా దెఁ(దెం?) తైనా గుట్టు నరపఁగరాదు
మనసిచ్చి నన్ను నేలె మాన నెట్టు నేర్తునే

(||pallavi||)
anniḍā jāṇam̐ḍainām̐ḍu ālanu nenu
panni tana sittamu paṭṭanĕḍu nerdune

(||anni||)
yichchagamāḍam̐gavalĕ iṁtulagum̐ badidonu
pachchigā navvam̐gavalĕ paigŏnavalĕ
machchariṁcharādu mari maṁkulu sūbam̐garādu
nichcham̐danabŏṁduseya nenĕṭṭu nerdune

(||anni||)
vūḍigamu seyavalĕ vŏddigado vibhunigi
veḍuga seyam̐gavalĕ viḍĕ mīvalĕ
pāḍibaṁtā lĕṁcharādu balimim̐ doyam̐garādu
jāḍamīri tanu nĕṭṭu jarayam̐ganerdune

(||anni||)
sĕnagam̐gavalĕ tānĕ śhrīveṁkaḍeśhum̐ḍu radim̐
bĕnam̐gavalĕ kām̐giḍa bĕrayavalĕ
guniyam̐garā dĕm̐(dĕṁ?) tainā guṭṭu narabam̐garādu
manasichchi nannu nelĕ māna nĕṭṭu nerdune