అన్నిటా జాణఁడ వైతే నౌదువుగాని
(॥పల్లవి॥)
అన్నిటా జాణఁడ వైతే నౌదువుగాని
కన్నచోటనెల్లాను కాంతను దూరకుమీ
(॥అన్ని॥)
పంతములేలాడేవుఁ బయలేలీదించేవు
యింతేసికి నోపునా యీపె నీతోను
చెంత మోము వంచుకొని సిగ్గుపడి నున్న నింతే
జంతల నాడినయట్టు సకియ నాడకుమీ
(॥అన్ని॥)
వేసాలేల సేసేవు వెగ్గళించేల నవ్వేవు
గాసిఁబెట్టితే నోర్చునా కిమిని గోల
మూసినముత్తెమువలె మోసమున నున్న దింతే
యీసడపువారివలె నీకె నెంచకుమీ
(॥అన్ని॥)
జాగులేల సేసేవు చలముల సాదించేవు
యీగతి నలమేల్మంగ యిచ్చగించునా
బాగుగా శ్రీవేంకటేశ బత్తితోఁ గూడె నింతె
భోగపు టింతులవలె పొలఁతిఁ జేయకుమీ
(||pallavi||)
anniḍā jāṇam̐ḍa vaide nauduvugāni
kannasoḍanĕllānu kāṁtanu dūragumī
(||anni||)
paṁtamulelāḍevum̐ bayalelīdiṁchevu
yiṁtesigi nobunā yībĕ nīdonu
sĕṁta momu vaṁchugŏni siggubaḍi nunna niṁte
jaṁtala nāḍinayaṭṭu sagiya nāḍagumī
(||anni||)
vesālela sesevu vĕggaḽiṁchela navvevu
gāsim̐bĕṭṭide norsunā kimini gola
mūsinamuttĕmuvalĕ mosamuna nunna diṁte
yīsaḍabuvārivalĕ nīgĕ nĕṁchagumī
(||anni||)
jāgulela sesevu salamula sādiṁchevu
yīgadi nalamelmaṁga yichchagiṁchunā
bāgugā śhrīveṁkaḍeśha battidom̐ gūḍĕ niṁtĕ
bhogabu ṭiṁtulavalĕ pŏlam̐tim̐ jeyagumī