Title (Indic)తా నేల వసివాడీ దగ్గర రమ్మనవే WorkAnnamayya songs LanguageTelugu Credits Role Artist Writer Annamacharya LyricsTelugu(॥పల్లవి॥) తా నేల వసివాడీ దగ్గర రమ్మనవే నేనే వెజ్జరికము నేరుతు నందుకునూ (॥॥) యెదిరి వారి చూపులు యెంత దన్ను నాఁటెనో మదన వేద మంత్రాల మంత్రింతునటే కదియఁ గాఁ జన్నులు కాయ మెంత వొత్తునో గుదిగొనఁ గాంతు నటే గోరి వెచ్చ కౌఁగిటా (॥॥) చెనకే వారి చేఁతల చిత్త మెంత మఱచెనో మొన గోరి సంజీవి మోపుదు నటే పెనఁగఁగా మర్మాలు ప్రేమ నెంత గరఁగెనో తనిపి పేరింతునటే తరితీపు సిగ్గులా (॥॥) మందవారి మాటలు మరులు గొలిపెనో దిందుపడ వలపు ల మందిత్తునటే అందపు శ్రీ వేంకటేశుఁ డలమేల్మంగను నేను చెందె నన్ను నిఁక నిట్టే సేతు నటే సేవలూ English(||pallavi||) tā nela vasivāḍī daggara rammanave nene vĕjjarigamu nerudu naṁdugunū (||||) yĕdiri vāri sūbulu yĕṁta dannu nām̐ṭĕno madana veda maṁtrāla maṁtriṁtunaḍe kadiyam̐ gām̐ jannulu kāya mĕṁta vŏttuno gudigŏnam̐ gāṁtu naḍe gori vĕchcha kaum̐giḍā (||||) sĕnage vāri sem̐tala sitta mĕṁta maṟasĕno mŏna gori saṁjīvi mobudu naḍe pĕnam̐gam̐gā marmālu prema nĕṁta garam̐gĕno tanibi periṁtunaḍe taridību siggulā (||||) maṁdavāri māḍalu marulu gŏlibĕno diṁdubaḍa valabu la maṁdittunaḍe aṁdabu śhrī veṁkaḍeśhum̐ ḍalamelmaṁganu nenu sĕṁdĕ nannu nim̐ka niṭṭe sedu naḍe sevalū