Anaraadu tannu nemee namdarilona

అనరాదు తన్ను నేమీ నందరిలోన
Language

(॥పల్లవి॥)
అనరాదు తన్ను నేమీ నందరిలోన
చనవు సారె సారె జాణతనాలేఁటికే

(॥అన॥)
నగనేలే తనకూ నాతోఁబతి చెనకితే
యెగసక్కే లాఁటదాని కేల మానునే
మగనాలింతే తాను మానాపతితనము
తగుఁగాక యిటువంటిదంటతన మేఁటికే

(॥అన॥)
సన్నలేలే తనకూ సరస మాతఁ డాడితే
యెన్ని కలు సవతుల కేల మానునే
చిన్నది యింతే తాను సిగ్గులు వడుతా నిట్టె
మన్ననతో నుండుఁగాక మందటాడనేఁటికే

(॥అన॥)
మాటలేలే తనకూ మమ్మాతఁడు గూడితేను
యీటు వెట్టేది చెల్లెండ్ల కేల మానునే
పాటించి శ్రీవేంకటాద్రిపతి యిట్టె నన్ను నేలె
నాటవలె నుండుఁగాక నన్ను మీరనేఁటికే

(||pallavi||)
anarādu tannu nemī naṁdarilona
sanavu sārĕ sārĕ jāṇadanālem̐ṭige

(||ana||)
naganele tanagū nādom̐badi sĕnagide
yĕgasakke lām̐ṭadāni kela mānune
maganāliṁte tānu mānābadidanamu
tagum̐gāga yiḍuvaṁṭidaṁṭadana mem̐ṭige

(||ana||)
sannalele tanagū sarasa mādam̐ ḍāḍide
yĕnni kalu savadula kela mānune
sinnadi yiṁte tānu siggulu vaḍudā niṭṭĕ
mannanado nuṁḍum̐gāga maṁdaḍāḍanem̐ṭige

(||ana||)
māḍalele tanagū mammādam̐ḍu gūḍidenu
yīḍu vĕṭṭedi sĕllĕṁḍla kela mānune
pāḍiṁchi śhrīveṁkaḍādribadi yiṭṭĕ nannu nelĕ
nāḍavalĕ nuṁḍum̐gāga nannu mīranem̐ṭige