Ana nimkemunnadi aluga nemunnadi

అన నింకేమున్నది అలుగ నేమున్నది
Language

(॥పల్లవి॥)
అన నింకేమున్నది అలుగ నేమున్నది
కనుఁగొనలనే చూచి కరఁగుట గాక

(॥అన॥)
నవ్వు నవ్వాజెల్లును నాలిసేయజెల్లు నీకు
రవ్వగా నే మోహించి రాఁపైనయందుకు
యెవ్వరితోఁ దగవూ లిఁక నాడే నేను
జవ్వనాన నొంటి నేను జడియుట గాక

(॥అన॥)
బిగియా నమరునూ బీరాలు నమరునూ
తగవులెంచక నిన్ను దగ్గరినయందుకు
జగడమూఁ జెల్లదూ సాదించ జెల్లదూ
మొగమోటమున నేనే ములుగుటగాక

(॥అన॥)
సరసము దక్కెనూ చనవెల్లా నెక్కెనూ
మరిగి నీకాఁగిట నేను మఱచినయందుకు
తెరయెత్తఁ బనిలేదు దిష్టము శ్రీవేంకటేశ
సరుగ నీరతిఁ జిక్కి సతమౌటగాక

(||pallavi||)
ana niṁkemunnadi aluga nemunnadi
kanum̐gŏnalane sūsi karam̐guḍa gāga

(||ana||)
navvu navvājĕllunu nāliseyajĕllu nīgu
ravvagā ne mohiṁchi rām̐painayaṁdugu
yĕvvaridom̐ dagavū lim̐ka nāḍe nenu
javvanāna nŏṁṭi nenu jaḍiyuḍa gāga

(||ana||)
bigiyā namarunū bīrālu namarunū
tagavulĕṁchaga ninnu daggarinayaṁdugu
jagaḍamūm̐ jĕlladū sādiṁcha jĕlladū
mŏgamoḍamuna nene muluguḍagāga

(||ana||)
sarasamu dakkĕnū sanavĕllā nĕkkĕnū
marigi nīgām̐giḍa nenu maṟasinayaṁdugu
tĕrayĕttam̐ baniledu diṣhṭamu śhrīveṁkaḍeśha
saruga nīradim̐ jikki sadamauḍagāga